
సాక్షి, సినిమా: ‘భరత్ అనే నేను’ సినిమాపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్టీఆర్ తన ట్విటర్ వేదికగా సినిమాపై అభిప్రాయాన్ని తెలిపారు. మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘ సామాజిక బాధ్యత, వాణిజ్య అంశాలు ఒకే మూవీలో చూపించడం అంత ఈజీ కాదు. ఒకేసారి ఈ రెండూ అంశాలను అంత అందంగా సమతుల్యం చేసి చూపించిన దర్శకుడు కొరటాల శివకు కుడోస్. అద్భుతమైన ప్రదర్శన చూపిన సూపర్ స్టార్ మహేశ్‌బాబుకు శుభాకాంక్షలు. నిజాయతీతో కూడిన అద్భుతమైన సినిమాను రూపొందించినందుకు ‘భరత్ అనే నేను’ మొత్తం చిత్ర బృందానికి నా అభినందనలు తెలుపుతున్నా’ అని ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా.. ‘భరత్ అనే నేను’ మూవీ ప్రీరిలీజ్ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ హాజరైన విషయం తెలిసిందే. ఈ వేడుకలో ఎన్టీఆర్ వేదికపై ప్రసంగిస్తూ ఒకరినొకరు పొగడ్తలు కురిపించుకున్నారు. అన్నయ్యా అంటూ ఎన్టీఆర్, బ్రదర్ అంటూ మహేశ్‌బాబు అప్యాయంగా పలకరించుకున్నారు.
ఈ నెల 20న విడుదలైన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డుల వేట మొదలు పెట్టిన భరత్ అనే నేను, బాహుబలి సీరీస్ తరువాత వేగం వంద కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా చరిత్ర సృష్టించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్‌ను సాధించటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment