
మరో చారిత్రక చిత్రంలో రానా!
'బాహుబలి', 'రుద్రమదేవి' సినిమాల్లో రాయల్ లుక్లో అదరగొట్టిన దగ్గుబాటి రానా మరో చారిత్రక పాత్రకు రెడీ అవుతున్నాడు. తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లో కూడా సుపరిచితుడైన నటుడు కావటంతో రానాకు భారీ చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా తమిళ్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఓ చారిత్రక చిత్రంలో రానాకు ఆఫర్ వచ్చింది. అయితే ఈ సినిమాలో తను నటిస్తుంది లేనిది ఇంకా రానా కన్ఫామ్ చేయలేదు.
తమిళ స్టార్ డైరెక్టర్ విష్ణువర్దన్ అజిత్ హీరోగా హిస్టారికల్ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. చోళ సామ్రాజ్యాన్ని స్ధాపించిన తొలి రాజు కథగా ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు విష్ణువర్ధన్. ఇప్పటికే కథా కథనాలను పూర్తి చేసిన దర్శకుడు ప్రస్తుతం లోకేషన్స్ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రకోసం రానాను సంప్రదించిన డైరెక్టర్ విష్ణువర్ధన్ రానా అంగీకారం కోసం ఎదురుచూస్తున్నాడు.
ఇప్పటికే అజిత్, విష్ణువర్థన్ల కాంబినేషన్లో వచ్చిన 'ఆరంభం' సినిమాలో రానా అతిథి పాత్రలో నటించాడు. దీంతో మరోసారి ఇదే కాంబినేషన్లో కలిసి నటించడానికి రానా ఓకె చెప్తాడన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం రానా హీరోగా నటించిన 'బెంగుళూర్ డేస్' రీమేక్ నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.