నిజ జీవిత అనుభవాల ఆధారంగా... | paathshala movie Promotional images Released | Sakshi
Sakshi News home page

నిజ జీవిత అనుభవాల ఆధారంగా...

Published Sat, Jul 26 2014 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM

నిజ జీవిత  అనుభవాల ఆధారంగా...

నిజ జీవిత అనుభవాల ఆధారంగా...

 అది కళాశాల ముగింపు రోజు. గడచిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, బరువెక్కిన హృదయాలతో విద్యార్థులంతా ఒకరికొకరు వీడ్కోలు పలుకుతున్నారు. అలాంటి క్షణంలో ఆ అయిదుగురు మిత్రులు... ‘ఎవరిళ్లకు వాళ్లు వెళ్లే ముందు... ఒకరి ఇళ్లకు ఒకరం నాలుగు రోజులు అతిథులుగా వెళ్దాం’ అని నిశ్చయించుకున్నారు. ఆ నిర్ణయమే ఆ మిత్రుల జీవితాల్లో అనూహ్యమైన మార్పుకు కారణమైంది. పదహారేళ్ల చదువులో నేర్చుకోని పాఠాలను ఈ నాలుగు రోజుల ‘పాఠశాల’ ఆ అయిదుగురికీ నేర్పింది... ఈ ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘పాఠశాల’.

సాయిరోనక్, అనుప్రియ, నందు, శిరీష ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మూన్‌వాటర్ పిక్చర్స్ పతాకంపై రాజేశ్ మహంకాళి, పవన్‌కుమార్‌రెడ్డి నిర్మించారు.  మహి వి.రాఘవ్ దర్శకుడు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా అతిథులుగా విచ్చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ, దేవా కట్టా, నందినీ రెడ్డి తమ కళాశాల నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అలాగే సినిమా విజయం సాధించాలని ఆకాక్షించారు. నిజ జీవితంలో ఎదురైన అనుభవాలనే ఆధారంగా చేసుకొని ఈ కథ తయారు చేశానని దర్శకుడు చెప్పారు. కథే ఈ చిత్రానికి ప్రాణమని నిర్మాతలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement