అప్పుడే నా ఫెయిల్యూర్స్ బయటపడ్డాయి: షారుక్
ముంబై: ఓ వైపు సక్సెస్ ఫుల్ నటుడుగా మరోవైపు తండ్రిగా సక్సెస్ అవుతున్న బాలీవుడ్ హీరోలలో షారుక్ ఖాన్ ఒకరని చెప్పవచ్చు. నిత్యం పిల్లల కోసం ఏదో చేయాలని, వారికి ఏదైనా అందించాలని తాపత్రయ పడుతుంటాడు షారుక్. అతడికు ఇద్దరు కొడుకులు అర్యన్, అబ్రాం కాగా, కూతురు సుహానా ఉన్నారు. తండ్రిగా జీవించడం అనేది ఓ ప్రత్యేకమైన ప్రయాణమని బాలీవుడ్ బాద్షా ట్విట్ చేశాడు. మాములుగా ఉన్నప్పటి కంటే తండ్రిగా ప్రమోషన్ వచ్చిన తర్వాత జీవితంలో భయాలు, వైఫల్యాలు బయటపడతాయని ఈ సీనియర్ స్టార్ హీరో అభిప్రాయపడుతున్నాడు.
అయితే, తండ్రిగా మారిన తర్వాత మన వైఫల్యాలు, భయాలు మాత్రమే కాదని.... ఒకరిని ఎంతగా ప్రేమించడం, ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం, పిల్లలతో బంధాన్ని ఏర్పరుచుకోవడం జరుగుతుంటాయని షారూక్ ట్వీట్ లో పేర్కొన్నాడు. తన పిల్లల ముగ్గురి కళ్లు, తన కళ్లు ఒకే తీరుగా ఉంటాయని గతంలో ఓ ఫొటో పెట్టిన విషయం తెలిసిందే. ఏమాత్రం ఖాళీ దొరికిన చిన్నారులే తన ప్రపంచమంటూ చాలాసార్లు ఈ హీరో చెప్పుకొస్తుంటాడు. షారుక్ ప్రస్తుతం 'ఫ్యాన్' మూవీ పనులతో బిజీబిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో అభిమానిగా, హీరోగా అతడు రెండు పాత్రల్లో కనిపించనున్నాడు.
Parenthood is a journey thru someone else’s life into ur own.It exposes ur failings, fears,ability 2 lov,hold on & most importantly,2 let go
— Shah Rukh Khan (@iamsrk) March 21, 2016