నా బాయ్ ఫ్రెండ్ సాధారణంగా ఉంటే చాలు! | Paris Hilton wants normal boyfriend | Sakshi
Sakshi News home page

నా బాయ్ ఫ్రెండ్ సాధారణంగా ఉంటే చాలు!

Published Mon, May 11 2015 10:54 AM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM

నా బాయ్ ఫ్రెండ్ సాధారణంగా ఉంటే చాలు! - Sakshi

నా బాయ్ ఫ్రెండ్ సాధారణంగా ఉంటే చాలు!

లండన్: గతేడాది మోడల్ రివర్ వీపెరీతో తెగతెంపులు చేసుకున్న తరువాత ఒంటరిగా ఉంటున్న నటి పారిస్ హిల్టన్ తన తదుపరి బాయ్ ఫ్రెండ్ సాధారణంగా ఉంటే చాలని అంటోంది. ఏదో ఒక రోజు తాను కూడా పెళ్లి చేసుకుని పిల్లలతో సెటిల్ కావాల్సిన సమయం తప్పక వస్తుందని వేదాంత ధోరణిలో మాట్లాడింది. 'నేను ప్రస్తుతం సింగిల్ గా ఉన్నాను. కానీ ఒంటరితనం అనేది నా జీవితంలో ఎప్పటికీ భాగం కాదు. ఇప్పటికే చాలా మందితో డేటింగ్ చేసినా వారిలో ఎవరో ఒకర్ని భాగస్వామిగా ఎంచుకునే పరిస్థితుల్లో లేను' హిల్టన్ తెలిపింది.

 

తనకు వచ్చేవాడు సాధారణంగా ఉంటే చాలని ఈ సందర్భంగా పేర్కొంది.  అతను ఒక మంచి వ్యక్తి అవడమే కాకుండా నాజూగ్గా ఉండాలని.. తాను ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement