'ఆ డేటింగ్ వార్తల్లో నిజం లేదు' | Paris Hilton sparks dating rumours with Joe Fournier | Sakshi
Sakshi News home page

'ఆ డేటింగ్ వార్తల్లో నిజం లేదు'

Published Thu, May 21 2015 7:39 AM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM

'ఆ డేటింగ్ వార్తల్లో నిజం లేదు' - Sakshi

'ఆ డేటింగ్ వార్తల్లో నిజం లేదు'

కేన్స్:మల్టీ మిలినియర్ జో ఫోర్నయిర్ తో తాను డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలో ఎటువంటి వాస్తవం లేదని నటి పారిస్ హిల్టన్ స్పష్టం చేసింది. 68 వ కేన్స్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు హిల్టన్ హాజరైన క్రమంలో జోతో డేటింగ్ చేసినట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఇటీవలే వీరి మధ్య చూపులు కలవడంతో ఈ జోడీ కేన్స్ లోని ఓ హోటల్ కలిసి గడిపినట్లు కొన్ని రూమర్లు వచ్చాయి. కాగా, వీటిని పారిస్ హిల్టన్ ఖండించింది. తనకు బ్రిటీష్ వ్యక్తులంటే ఇష్టమని.. అందుచేత అతనితో కాస్త చనువుగా ఉన్నానని తెలిపింది. దీనికి డేటింగ్ అంటూ సంబంధాలు అంటగడుతున్నారని పేర్కొంది.

 

కేన్స్ కు వచ్చిన సందర్భంలో తన పెంపుడు కుక్కలను మిస్ అవుతున్నట్లు పేర్కొంది. మనుషుల కంటే కుక్కలే నయమని ఛలోక్తులకు విసిరింది. బాయ్ ఫ్రెండ్స్ తో సంబంధాల పట్ల ఇప్పుడు తనకు అంతమోజు లేదని వేదాంత ధోరణిలో మాట్లాడింది. గతంలో తాను బాయ్ ఫ్రెండ్స్ ను కలిసినప్పుడల్లా సంతోషానికి దూరమవుతూనే ఉన్నానని హిల్టన్ తెలిపింది. ప్రస్తుతం తాను గడుపుతున్న ఒంటరి జీవితం చాలా బాగుందని తెలిపింది.


గతేడాది మోడల్ రివర్ వీపెరీతో తెగతెంపులు చేసుకున్న తరువాత ఒంటరిగా ఉంటున్న హిల్టన్ తన తదుపరి బాయ్ ఫ్రెండ్ సాధారణంగా ఉంటే చాలని ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే . అతను ఒక మంచి వ్యక్తి అవడమే కాకుండా నాజూగ్గా ఉండాలని.. తాను ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement