కురల్‌ 388లో ఆ నాయకులెందుకు? | political leaders pics in kural388 movie poster | Sakshi
Sakshi News home page

కురల్‌ 388లో ఆ నాయకులెందుకు?

Published Sun, Nov 26 2017 8:37 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

political leaders pics in kural388 movie poster - Sakshi

కురల్‌ 388 చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

తమిళసినిమా: కురల్‌ 388 చిత్రం టాక్‌ ఆఫ్‌ ఇండస్ట్రీగా మారింది. అందుకు కారణం ఆ చిత్ర పోస్టర్‌నే. టాలీవుడ్‌ యువ నటుడు మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కురల్‌ 388. ఇవన్‌వేరమాదిరి, వెలై ఇల్లా పట్టాదారి చిత్రాల ఫేమ్‌ సురభి నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సతీష్‌కుమార్‌ పూతోట తమిళం, తెలుగు భాషల్లో భారీ ఎత్తున్న నిర్మిస్తున్నారు. నవ దర్శకుడు జీఎస్‌.కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాజేశ్‌యాదవ్‌ చాయాగ్రహణం, ఎస్‌ఎస్‌.తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విష్ణు మంచు పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 23న విడుదల చేశారు. విష్ణు ముఖంతో కూడిన ఆ పోస్టర్‌లో ప్రధాని నరేంద్రమోది, ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, స్టాలిన్, విజయకాంత్‌ ఇలా ప్రాంతియ, జాతీయ రాజకీయ నాయకుల ఫొటోలను పొందుపరిచడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఆ పోస్టర్‌లో వారి ఫొటోలను పొందుపరచడంలో ఆంతర్యం ఏమిటన్న చర్చ జరుగుతోంది. ది ఎన్నికల్లో గెలవడమే ప్రధానంగా ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు చేసేసి ఆ తరువాత వాటి విషయాన్నే మరచిపోయే స్వార్థ« రాజకీయవాదుల ముఖ చిత్రాలను ఆవిష్కరించే చిత్ర కథే కురల్‌ 388 అని చిత్ర వర్గాలు తెలిపారు. తెలుగులో ఓటర్‌ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం తిరువళ్లువర్‌ రాసిన కురల్‌ 388లోని అంశాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందని తెలిపారు. చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుందని, డిసెంబర్‌లో కురల్‌ 388 చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement