
పెరంబూరు: ఇది ఎన్నికల సమయం. రాజకీయనాయకులకు ప్రజలు గుర్తుకొచ్చేది ఇప్పుడే. వారి కష్టాలు, సమస్యలు అన్నీ తెలిసేదీ సమయంలోనే. పేద, గొప్ప అన్న తారతమ్యం లేకుండా పత్రి వారికి దండం పెడతారు. వారిని ఓట్లుగా మార్చుకోవడానికి ఏఏ అవకాశాలు ఉన్నాయో అన్నింటి పైనా దృష్టి పెడతారు. తమకు ఉపయోగ పడుతుందంటే వాడుకోవడానికి రాజకీయనాయకులు దేన్నీ వదిలి పెట్టరు. అవునండి మరి రాజకీయ నాయకులండి. ఇదంతా తెలిసిన సోదేగా అంటారా! రాజకీయపార్టీలు సినిమా గ్లామర్‌ను తెగ వాడేసుకుంటున్నారు. ఇదీ కొత్త విషమేమీ కాదు. సినిమా వాళ్లు కూడా రాజకీయ ప్రాపకం కోసం ఎగబడుతున్నారు ఇందులోనూ వింతేమీ లేదు.
అయితే రాజకీయాలకు అతీతంగా ఉండాలనుకునేవారు కొందరుంటారు. వారిని వాడేసుకోవాలనుకుంటున్నారు. ఉదాహరణకు భారతీయ సినీరంగంలో సంగీతరారాజుగా వాసికెక్కిన ఇళయరాజా రాజకీయాల జోలికి పోయిన పాపాన పోలేదు. అయితే ఆయన్ని తమకు ఓట్లు రాబట్టుకోవడానికి పెట్టుబడిగా వాడేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇళయరాజా వర్గమే పేర్కొన్నారు. అంతేకాదు ఇళయరాజా పేరును కొన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో లబ్ధిపొందే విధంగా వాడుకుంటున్నారని, అలా ఆయన పేరును గానీ, ఫొటోలను గానీ వాడుకోరాదని హెచ్చరిస్తూ ఒక ప్రకటన కూడా చేశారు. సాధారణంగానే తనకు సంబంధించి తన అనుమతి లేకుండా ఏం చేసినా ఈ సంగీతజ్ఞాని ఒప్పుకోరు. అవసరం అయితే చట్టాన్ని ఆశ్రయించడానికైనా సిద్ధపడతారు. అయినా అనుమతి లేకుండా అలా ఇతర ప్రముఖులు పేర్లను వాడుకోవడం తప్పు కదా! ఎలా ఇలాంటి చర్యలకు పాల్పడతారండి. రాజకీయనాయకులు కదంది! అంతేనండి.
Comments
Please login to add a commentAdd a comment