
బిగ్‌బాస్ షో: ఆదర్శ్ వల్లే ప్రిన్స్ ఔట్..!
సాక్షి, హైదదాబాద్: తెలుగు బిగ్‌బాస్ సీజన్ 1 చివరిదశకు చేరుకుంది. ఆదివారం ఎన్టీఆర్ కన్టెస్టెంట్స్‌తో వెరైటీ కబడ్డీ ఆడించారు. ప్రిన్స్, శివబాలాజీ, అర్చనలు ఒక టీం గా.. ఆదర్శ్, హరితేజ, నవదీప్‌లు మరో గ్రూప్‌గా ఉన్నారు. ఇక దీక్షా పంత్‌ను గేమ్‌కు ఆధ్వర్యం వహించమన్నారు. అయితే కూతకు వెళ్లే కన్టెస్టెంట్స్ కబడ్డీ.. కబడ్డీ అని కాకుండా హౌస్‌లో ఉన్న తమకు ఇష్టమైన పేరును కూతగా పెట్టాలంటూ కండిషన్ పెట్టారు. ఫన్నీ.. ఫన్నీగా సాగిన ఈగేమ్‌లో అర్చన టీం రెండు పాయింట్ల తేడాతో హరితేజ టీంపై గెలుపొందింది.
‘నిప్పు లాంటి నిజం’ టాస్క్‌లో ఇప్పటి వరకూ ఎక్కడా షేర్ చేసుకోని నిజాన్ని బిగ్‌బాస్ హౌస్‌లో బహిర్గతం చేయాలని అయితే కేవలం నిజం మాత్రమే చెప్పాలన్నారు. దీంతో ప్రిన్స్ జీవితంలో జరిగిన యాక్సిడెంట్‌ను తన తండ్రికి తెలియకుండా దాచానని అదే నిప్పులాంటి నిజం అంటూ ఆటను ప్రారంభించాడు. ఈ తరువాత దీక్ష, హరితేజ, ఆదర్శ్,అర్చన తమ జీవితంలో దాచిన నిజాలను షేర్ చేసుకోగా.. శివబాలాజీ తనకు ఎలాంటి నిజాన్ని దాచే అలవాటు లేదని అందుకే సీక్రెట్స్ ఏం లేవన్నారు. ఒక యాక్సిడెంట్ విషయంలో తన ప్రమేయం లేకుండా ఒక కుటుంబం పెద్ద దిక్కుని కోల్పోయిందని వాళ్లని క్షమించమని కోరుతున్నట్టు కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో ఎన్టీఆర్ కూడా ఆ కుటుంబాన్ని నవదీప్ తరపున క్షమించమని కోరారు.
ఈవారం ఎలిమినేషన్‌లో ఉన్న నవదీప్, ప్రిన్స్, ఆదర్శ్‌లలో నవదీప్, ఆదర్శ్ సేఫ్ జోన్‌లో ఉన్నట్టు ఎన్టీఆర్ ప్రకటించారు. ఇక బిగ్ బాస్ హౌస్‌లో ఆదర్శ్ చేసిన తప్పిదం వల్ల ప్రిన్స్ ఈ వారం బిగ్ బాస్ హౌస్‌ను వీడుతున్నట్లు తెలిపారు. ఇక హౌస్ నుండి బయటకు వచ్చిన ప్రిన్స్.. బిగ్‌బాస్ సీజన్ 1 టైటిల్‌ను నవదీప్, హరితేజలలో ఎవరో ఒకరు గెలవొచ్చనన్నారు. ప్రిన్స్ బిగ్‌బాస్ హౌస్ వీడుతూ తన జీవితంలో ఈ అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేనంటూ ఉద్వేగంగా మాట్లాడాడు. వెళ్తూ.. వెళ్తూ బిగ్‌బాంబ్‌ను దీక్షపై వదిలాడు. దీంతో దీక్ష వారం రోజులపాటు ఎక్కడకు వెళ్లినా పాకుతూనే వెళ్లాలి.