అన్నాచెల్లెళ్ల అనుబంధం | Priya Dutt hugs brother Sanjay Dutt | Sakshi
Sakshi News home page

అన్నాచెల్లెళ్ల అనుబంధం

Published Fri, Feb 26 2016 8:17 PM | Last Updated on Sun, Sep 3 2017 6:29 PM

అన్నాచెల్లెళ్ల అనుబంధం

అన్నాచెల్లెళ్ల అనుబంధం

ముంబై : 42 నెలల జైలు శిక్ష తర్వాత గురువారం విడుదలైన సంజయ్ దత్ కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలతో తడిసి ముద్దవుతున్నారు. విలేకరుల సమావేశంలో ఉండగానే సంజయ్ పిల్లలిద్దరూ ఆయనను అల్లుకుపోయారు. ఇక భార్య మాన్యత భావోద్వేగం బయటపడకుండా కళ్లను గాగుల్స్ వెనుక దాచేశారు. అభిమానుల సంబరమైతే చెప్పనక్కర్లేదు. చెల్లెలు ప్రియా దత్ ఇంట్లో అన్నను చూడగానే సంతోషంతో హత్తుకున్నారు. నిజంగా ఇది జీవితంలో మర్చిపోలేని రోజంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

తమ కుటుంబం ఎప్పుడూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేదని ప్రియా గురువారం సంజయ్ దత్ విడుదల సందర్భంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక 'ఇంటికి చేరుకోగానే ఎలా ఫీలయ్యారు' అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ఏం లేదు, ముందు టీ తాగాను అని సమాధానమిచ్చారు సంజూ బాబా. శుక్రవారం అంతా బంధుమిత్రుల పరామర్శలతో మున్నా భాయ్ బిజీగా గడిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement