అబ్బాయిల గుండెల్ని పేల్చేసింది! | Priya Prakash Varrier starrer Oru Adaar Love teaser | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 14 2018 9:17 AM | Last Updated on Wed, Feb 14 2018 3:48 PM

Priya Prakash Varrier starrer Oru Adaar Love teaser - Sakshi

ఆమె కన్నుగీటితే యువత అమాంతం పడిపోయింది. ఆమె కనుసైగల కదలికలకు కొత్త లోకంలో తేలిపోయినట్టు ఫిదా అయింది. ఆమె హవాభావాలు చూసి ప్రేమమైకంలో మునిగిపోయింది. ఒక్క యువత ఏంటి.. అందరూ ఈ వాలెంటైన్స్‌ డే నాడు నిండా 40 సెకన్ల నిడివిలేని ఆమె వీడియోతో ప్రేమలో పడ్డారు. ఆమె హావభావాలకు ఊగిపోయారు. తమలోని ప్రేమభావాలను తరచిచూసుకున్నారు. ఆమే ఇండియాస్‌ క్రష్‌.. లెటెస్ట్‌ ఇంటర్నెట్‌ సెన్సేషన్‌ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌.. ఇప్పుడు సోషల్‌ మీడియాలోనే కాదు నేషనల్‌, లోకల్‌ మీడియాలోనూ అంతట ఆమె గురించే చర్చ. ఆమె ఎవరు అని ప్రతి ఒక్కరూ ఆరా తీస్తున్నారు. ఓవర్‌నైట్‌ సెన్సేషనల్‌ స్టార్‌ అయిన ఈ పదెనిమిదేళ్ల అమ్మాయి గురించి సూపర్‌ స్టార్లు మొదలు టీనేజ్‌ అబ్బాయిల వరకు ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రేమికుల రోజు కానుకగా ఒక తూటాలాంటి ముద్దుతో యువకుడి గుండెను ప్రేమతో పేల్చేసిన ఆమె మరో వీడియోను ఆన్‌లైన్‌లో వదిలారు. ‘ఒరు ఆదార్‌ లవ్‌’ అనే మలయాళ సినిమాతో ప్రియాప్రకాశ్‌ వారియర్‌ అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కనుసైగలతో, కన్నుగీటుతూ యువకుడిని ప్రేమమైకంలో ముంచెత్తే ప్రియాప్రకాశ్‌ వీడియో ఇప్పటికే సెన్సేషనల్‌ అయింది.

ఈ ఒక్క వీడియోతో ఓవర్‌నైట్‌ ఆమె నేషనల్‌ స్టార్‌ అయిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు మిలియన్‌కుపైగా ఫాలోవర్లు యాడ్‌ అయ్యారు. మార్చి 3న విడుదల కానున్న ఈ సినిమాకూ విశేషమైన్‌ క్రేజ్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో ‘ఒరు ఆదార్‌ లవ్‌’ సినిమా టీజర్‌ను తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ వీడియోలో ప్రియ.. ఒక ఫ్లయింగ్‌ కిస్‌ని గన్‌లా మార్చి తూటాలా పేల్చితే.. అది తగిలి ఆమె లవర్‌ విలవిలలాడుతాడు. నిజానికి ఆమె విసిరిన ఫ్లయింగ్‌ కిస్‌కు అబ్బాయిలు గుండెలు పేలిపోయాయని నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement