తన పట్ల దురుసుగా ప్రవర్తించిన పాకిస్తాన్ మహిళకు ప్రముఖ నటి ప్రియాంక చోప్రా ఘాటు సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా ఆమె నోరు కూడా మూయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. శనివారం లాస్ ఎంజిల్స్‌లో బ్యూటికాన్ పేరిట జరిగిన కార్యక్రమానికి ప్రియాంక హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో భాగంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ప్రియాంక సమాధానాలు చెప్పడం ప్రారంభించారు. అప్పుడే ఓ పాకిస్తాన్ మహిళ ప్రియాంక ప్రసంగానికి అడ్డుతగిలారు. గతంలో భారత బలగాలు ఉగ్రస్థావరాలపై దాడులు జరిపినప్పుడు ప్రియాంక చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు.
‘పాకిస్తాన్‌పై భారత బలగాలు వైమానిక దాడులు జరిపినప్పుడు మీరు జైహింద్ అంటూ ట్వీట్ చేశారు. యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉంటూ పాక్‌పై న్యూ క్లియర్ యుద్దం జరగాలని అనుకుంటున్నారు. మీరు ఆ పదవిలో ఉండేందుకు అనర్హులు. నాలాగే చాలా మంది పాకిస్తాన్ ప్రజలు మిమ్మల్ని ఇష్టపడతారు. కానీ ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారా?’ అంటూ పాక్ మహిళ గట్టి గట్టిగా అరిచారు. అయితే ఆమె మాట్లాడినంత సేపు మౌనంగా ఉన్న ప్రియాంక.. ఆ తర్వాత చాలా ఓపికగా సమాధానమిచ్చారు.
That Pakistani girl who jumped @priyankachopra was very disrespectful! #BeautyconLA smh i was supposed to be the next one to ask a question but she ruined it for all pic.twitter.com/KrLWsLEACa
— Kadi (@ItsnotKadi) August 10, 2019
‘నేను మీ మాటలు వినాను. నాకు పాక్‌లో చాలా మంది స్నేహితులు ఉన్నారు. నేను భారతీయురాలిని. నా దేశం అంటే నాకు గౌరవం. యుద్దం దేనికి పరిష్కారం కాదు. నేను ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. ఒకవేళ నన్ను ఇష్టపడేవారి సెంటిమెంట్స్ దెబ్బతింటే సారీ. నువ్వు నీ దేశం కోసం ఎలా ప్రశ్నిస్తున్నావో, నేను కూడా అంతే. కానీ నువ్వు అడిగిన విధానం బాగాలేదు. ఇలాంటి ప్రశ్నలు అడగాడినికి ఇది వేదిక కాదు. అనవసరంగా అరచి మీ విలువను తగ్గించుకోవద్ద’ని సూచించారు. ప్రపంచంలో సగం సంఖ్యలో ఉన్న మహిళలు.. ప్రతి రంగంలో ముందువరుసలో నిలువాలని ప్రియాంక అన్నారు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ మందుకు సాగాలని ఆకాక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment