
ప్రియాంక చోప్రా ఈమధ్య రోజూ వార్తల్లో ఉంటున్నారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి కూడా ఆమె స్టార్ స్టేటస్ పెరిగిపోవడంతో ఇంటర్నేషనల్ ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల్లోనూ ఉంటున్నారామె. అయితే ఈ వార్తలన్నీ ఆమె ప్రేమకథ చుట్టూనే తిరుగుతున్నాయి. కొద్దికాలంగా ప్రియాంక పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో ఉన్నారు. వీరిద్దరి ప్రేమకథ తాజాగా ఎంగేజ్‌మెంట్ వరకూ వెళ్లిందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వినిపిస్తోంది. సినిమాల గురించి, బ్రాండింగ్ గురించి మాట్లాడటానికి ఇష్టపడే ప్రియాంక, బాయ్‌ఫ్రెండ్ గురించి, ఎంగేజ్‌మెంట్ గురించి మాత్రం ఎక్కడా మాట్లాడటం లేదు.
దీంతో డిస్కషన్ అంతా ప్రియాంక చెప్పని విషయంపైనే జరుగుతోంది. ఇలా రోజూ వార్తల్లోనే ఉంటున్న ఆమె ఇవేవీ పట్టించుకోకుండా, ఎంచక్కా న్యూయార్క్ నగర వీధుల్లో తను ఇష్టంగా పెంచుకుంటున్న పెట్ డాగ్‌ను పట్టుకొని తిరుగుతున్నారు. బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేయని ఆమె, ఈ పెట్‌ను మాత్రం ‘గర్ల్‌ఫ్రెండ్’ అని పరిచయం చేస్తున్నారు!