రాహుల్‌కు పునర్నవి రాఖీ కట్టిందా? | Punarnavi May Tied Rakhi To Rahul In Bigg Boss 3 Telugu | Sakshi
Sakshi News home page

రాహుల్‌కు పునర్నవి రాఖీ కట్టిందా?

Aug 16 2019 5:31 PM | Updated on Aug 16 2019 10:46 PM

Punarnavi May Tied Rakhi To Rahul In Bigg Boss 3 Telugu - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో వరుణ్‌ సందేశ్‌-వితికా షెరు కాకుండా మరో జంట గురించి సోషల్‌మీడియాలో తెగ ట్రోల్స్‌ వస్తుంటాయి. రాహుల్‌-పునర్నవిల మధ్య ట్రాక్‌ నడుస్తుందంటూ మీమ్స్‌ హల్‌చల్‌ చేస్తుంటాయి. దీనికి తగ్గట్లే వీరిద్దరి మాటలు, చేష్టలు కూడా ఉంటాయి. ఇద్దరూ ఏకాంతంగా కూర్చుని మాట్లడటం.. పునర్నవిని డేట్‌కు పిలవడం.. ప్రపోజ్‌ చేస్తే ఏం సమాధానమిస్తవ్‌ అని రాహుల్‌ అడగడం.. ఇలా సరదాగా మాట్లాడుకోవడం లాంటివి చేస్తుండటతో వీరిద్దరి విషయంపై అందరూ ఆసక్తిచూపుతున్నారు.

పునర్నవికి సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చినప్పుడు కూడా.. రాహుల్‌ విషయంలో పాజిటివ్‌గా చెప్పుకొచ్చింది. తాను అందరి కోసం త్యాగం చేస్తాడని అదే అతనిలో నచ్చదని, ఈ ఇంట్లో తనతో ఎక్కువ క్లోజ్‌ అయ్యానని తెలిపిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులు నేడు జరగబోయే ఎపిసోడ్‌లో రాఖీ పండుగను సెలబ్రేట్‌ చేసుకోనున్నారు. ఈ ఈవెంట్లో పునర్నవి ఎవరి గురించో చెబుతూ.. అతడిలో తన తమ్ముడిని చూసుకున్నానని చెప్పుకొచ్చింది. దీంతో హౌస్‌మేట్స్‌ అందరూ పగలబడినవ్వారు. రాహుల్‌కే రాఖీ కట్టి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి నేటి ఎపిసోడ్‌లో ఎవరు ఎవరికి రాఖీ కట్టారు? హౌస్‌మేట్స్‌ పండుగను ఎలా సెలబ్రేట్‌ చేసుకున్నారో చూడాలి.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement