యూరప్‌లో హార్ట్ ఎటాక్ | Puri Jagannath Film 'Heart Attack' Shooting in Europe | Sakshi
Sakshi News home page

యూరప్‌లో హార్ట్ ఎటాక్

Published Mon, Sep 9 2013 12:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM

యూరప్‌లో హార్ట్ ఎటాక్

యూరప్‌లో హార్ట్ ఎటాక్

పూరి జగన్నాథ్ సినిమా అంటే.. టైటిల్ నుంచే చర్చలు మొదలు. ప్రస్తుతం నితిన్‌తో ఆయన ‘హార్ట్ ఎటాక్’ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. సినీ వర్గాల్లో ప్రస్తుతం ఈ టైటిల్ గురించే చర్చ. టైటిల్ యాంటీగా ఉన్నా... ఫలితం మాత్రం కచ్చితంగా పాజిటివ్‌గా ఉంటుందనే కాన్ఫిడెన్స్‌తో ఉంది ఈ చిత్రం యూనిట్. ‘హార్ట్ ఎటాక్’ చిత్రానికి నిర్మాత కూడా పూరీనే. 
 
 ఈ చిత్రంలో నటించే కథానాయిక విషయంలో రకరకాల పేర్లు వెలుగు చూశాయి. చివరకు బాలీవుడ్ భామ అధాశర్మని కథానాయికగా తీసుకున్నారు పూరీ. ఇటీవల హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీలో రాత్రివేళల్లో చిత్రీకరణ జరుపుకుందీ సినిమా. ఈ నెల 12 నుంచి యూరప్‌లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు పూరి జగన్నాథ్. 
 
 వరుసగా రెండు విజయాలతో మంచి జోష్ మీదున్న నితిన్‌కి ఇది కచ్చితంగా హ్యాట్రిక్ హిట్‌గా నిలుస్తుందని యూనిట్ వర్గాలు నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. నవ్యమైన కథ, కథనాలతో పూరీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని సమాచారం. టైటిల్‌లో ఉన్న కొత్తదనం సినిమాలో కూడా ఉంటుందని తెలుస్తోంది. పూరి చిత్రానికి తొలిసారిగా అనూప్ రూబెన్స్ స్వరాలందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement