![ఇప్పుడు ‘ఏడీ’తర్వాత ‘డి’! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/41495651676_625x300.jpg.webp?itok=p5tEmj8G)
ఇప్పుడు ‘ఏడీ’తర్వాత ‘డి’!
‘ఏడీ’ అంటే సినిమా లాంగ్వేజ్‌లో ‘అసిస్టెంట్ డైరెక్టర్’ అని అర్థం. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఏడీల లిస్ట్‌లో ఇటీవల ఓ కొత్త మెంబర్ యాడ్ అయ్యారు. ఆ అమ్మాయి ‘పవిత్రా పూరి’. ఈ ఏడీ ఎవరో ఈపాటికే ఊహించి ఉంటారు. యస్.. మీ గెస్ కరెక్టే. పూరి తనయ పవిత్రా పూరి ఆయన తాజా చిత్రానికి సహాయ దర్శకురాలిగా చేస్తోందట.
బాలకృష్ణ, శ్రియ జంటగా పూరి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్‌లో జరుగుతోంది. అక్కడ హెలికాపర్ట్ ఛేజ్ సీన్స్ తీస్తున్నారు. ఈ షూటింగ్‌లో డైరెక్షన్‌లో మెలకువలు తెలుసుకుంటోందట పవిత్ర. సో.. ఇప్పుడు ఏడీగా చేస్తున్న పవిత్ర ‘డి’ అవుతుందా? అదేనండీ.. డైరెక్టర్ అవుతుందా? భవిష్యత్తు ఏం నిర్ణయిస్తుందో వేచి చూద్దాం.