ఒకే సినిమాలో పదిమంది హీరోయిన్లు | PVP banner lady oriented multistarer with ten heroines | Sakshi
Sakshi News home page

ఒకే సినిమాలో పదిమంది హీరోయిన్లు

Published Sun, Feb 7 2016 10:18 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM

ఒకే సినిమాలో పదిమంది హీరోయిన్లు

ఒకే సినిమాలో పదిమంది హీరోయిన్లు

టాలీవుడ్ స్క్రీన్ మీద మరో ఆసక్తికరమైన సినిమా సందడి చేయనుంది. భారీ చిత్రాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన బడా నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్లో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇప్పటి వరకు ఇద్దరు హీరోలు కలిసి నటించిన సినిమాలను మాత్రమే మల్టీ స్టారర్ సినిమా అనేవారు. కానీ తాజాగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా మల్టీ స్టారర్ చేయవచ్చని ప్రూవ్ చేయడానికి రెడీ అవుతోంది పివిపి సంస్థ.

అది కూడా ఒకరిద్దరు హీరోయిన్స్తో కాదు, ఏకంగా పది మంది హీరోయిన్స్తో ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత, అనుష్క లాంటి టాప్ హీరోయిన్స్తో పాటు అనసూయ, రష్మీ లాంటి స్మాల్ స్క్రీన్ సెన్సేషన్లు కూడా నటించే అవకాశం ఉంది. గతంలో నాగార్జున నటించిన కింగ్ సినిమాలో ఒక్కపాటలో ఎనిమిది మంది హీరోయిన్లు సందడి చేయగా, ఇప్పుడు ఈ సినిమాలో పది మంది హీరోయిన్లు ఫుల్లెంగ్త్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు.

ఈ సినిమాకు సంబందించిన కథ కూడా రెడీగా ఉందంటున్న పివిపి సంస్థ, ఎవరు దర్శకత్వం వహిస్తారు, సినిమా ఎప్పుడు మొదలవుతుంది లాంటి అంశాలను మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికే సైజ్ జీరో, క్షణం లాంటి సినిమాలతో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలను ప్రమోట్ చేస్తున్న పివిపి సంస్థ, ఒకే సినిమాలను పది మంది హీరోయిన్లు ఉంటే ఇంకే స్థాయిలో తెరకెక్కిస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement