
‘ఎఫ్2’ సినిమాతో మళ్లీ విక్టరీ వెంకటేష్ ఫామ్ లోకి వచ్చారు. సంక్రాంతి బరిలోకి దిగిన ఈ చిత్రం ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రాన్ని ఇప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా ఈ మూవీ 50రోజుల్ని పూర్తి చేసుకుని ఇంకా కొన్ని థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
అయితే ఈ మూవీ ఇచ్చిన సక్సెస్‌తో వెంకటేష్ చకాచకా ప్రాజెక్ట్స్‌ను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్‌లో రాబోతోన్న వెంకీమామా షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే అల్లుడు నాగ చైతన్యతో కలసి వెంకటేశ్ ఆటాపాటా మొదలెట్టేశారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్, నాగ చైతన్యకు జోడిగా రాశీ ఖన్నా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ షూటింగ్‌లో రాశీ ఖన్నా జాయిన్ అయ్యారని తెలుస్తోంది. షూటింగ్‌కు సంబంధించి మేకప్ వేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘న్యూ బిగినింగ్.. వెంకీమామా షూటింగ్‌లో మొదటి రోజు’ అని ట్వీట్ చేశారు. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కేయస్ రవీందర్ (బాబీ) తెరకెక్కిస్తున్నారు.
New beginnings ☺️
— Raashi Khanna (@RaashiKhanna) March 2, 2019
Day 1.#VenkyMama 🌼 pic.twitter.com/N1iaWUX7QR