
ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ నటుడు రాఘవ లారెన్స్ తమిళ తలైవా రజనీకాంత్‌కు వీరాభిమాని. చెన్నైలో జరిగిన దర్బార్ ఆడియో లాంచ్‌లో ఆయన చేసిన ప్రసంగం ఎన్నో చిక్కులను తెచ్చిపెట్టింది. చిన్నతనంలో కమల్ హాసన్ పోస్టర్లపై పేడ విసిరాను అని చెప్పడంతో కమల్ అభిమానులు రాఘవను దారుణంగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దీంతో రాఘవ ఈ విమర్శలకు ఫుల్‌స్టాప్ పెట్టడానికి ప్రయత్నించాడు. అందులో భాగంగా ఆయన కమల్ హాసన్‌ను కలిసి ఈ విషయంపై వివరణ ఇచ్చుకున్నాడు. అనంతరం వీరిద్దరూ ఆత్మీయంగా కలిసి దిగిన ఫొటోను రాఘవ ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. నన్ను ట్రోల్ చేసేముందు పూర్తి వీడియో చూడాలని కోరారు.
చిన్నతనంలో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై ఉన్న ప్రేమతో ఇతర నటుడైన కమల్ హాసన్ పోస్టర్లపై పేడ విసిరానన్నారు. కానీ పెద్దయ్యాక రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నడుస్తుంటే సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. దయచేసి తన మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దని కమల్ హాసన్ అభిమానులను కోరాడు. ‘నేను నిజంగా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమాపణలు కోరేవాన్ని. కానీ, నేనేం తప్పుగా మాట్లాడలేదు. కావాలంటే పూర్తి వీడియో చూడండి. నాకు కమల్ సర్ అంటే ఎంతో గౌరవం. నాపై ప్రేమ చూపించిన కమల్ హాసన్‌కు కృతజ్ఞతలు’ తెలిపారు. కాగా రాఘవ తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన హారర్ చిత్రం కాంచనను హిందీలో ‘లక్ష్మీబాంబ్ ’పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. (చదవండి: కమల్, రజనీ సెన్సేషనల్ న్యూస్)