‘రాగిణి ఎంఎంఎస్’ హీరోయిన్‌తో రొమాన్స్
శివాజి హీరోగా ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. హిందీ సినిమా ‘రాగిణి ఎంఎంఎస్’తో ప్రాచుర్యం పొందిన కైనాజ్ మోతివాలా ఇందులో కథానాయిక. రేవన్ యాదు దర్శకుడు. రమేష్ అన్నంరెడ్డి, ప్రసాద్ రెడ్డి నిర్మాతలు. 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విశేషాలను తెలుపడానికి శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివాజి మాట్లాడుతూ- ‘‘ఆరు నెలల క్రితం ఈ కథ విన్నాను. అద్భుతం అనిపించింది.
అందుకే ధైర్యంగా సెట్స్‌కి వెళ్లాం. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. రేవన్ చాలా బాగా తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు. ‘‘దర్శకునిగా ఇది నా తొలి సినిమా. చాలాకాలం గుణశేఖర్ దగ్గర సహాయకునిగా పనిచేశాను’’ అని దర్శకుడు చెప్పారు. నిర్మాతలు చెబుతూ- ‘ఫార్మారంగంలో ఉన్న మేం సినిమాపై అభిరుచితో ఈ చిత్ర నిర్మాణానికి పూనుకున్నాం. దీపావళికి సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఇంకా రచయిత సాయికృష్ణ, బెక్కెం వేణుగోపాల్ కూడా మాట్లాడారు. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: సాయికృష్ణ, కెమెరా: విజయ్ మిశ్రా, సంగీతం: రాజ్‌భాస్కర్, పాటలు: శ్రీమణి, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి.