నెక్ట్స్ ప్రాజెక్ట్పై రాజమౌళి కామెంట్
ప్రస్తుతం బాహుబలి 2 పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళి తన నెక్ట్స్ ప్రాజెక్ట్పై ఆసక్తికర కామెంట్ చేశాడు. బాహుబలి రెండో భాగం సెట్స్ మీద ఉండగానే రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరోసారి భారీ గ్రాఫిక్స్తో మహాభారతాన్ని తెరకెక్కిస్తాడని, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్తో సినిమా చేస్తాడని.. ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. రాజమౌళి మాత్రం అఫీషియల్గా ఇంత వరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్పై స్పందించలేదు.
తాజాగా బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ సందర్భంగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్పై ఆసక్తికర కామెంట్ చేశాడు రాజమౌళి. బాహుబలి పార్ట్ 2కు గ్రాఫిక్స్ సూపర్ వైజర్గా పనిచేసిన కమల్ కణ్నన్ను ఉద్దేశిస్తూ 'నా నెక్ట్స్ సినిమా ఇతని సాయం లేకుండా చేయాలనుంది. అందుకే నా నెక్ట్స్ ప్రాజెక్ట్కు గ్రాఫిక్స్ అవసరం లేకుండా ప్లాన్ చేస్తా' అన్నాడు. బాహుబలి తొలి భాగానికి గ్రాఫిక్స్ సూపర్ వైజర్గా శ్రీనివాసమోహన్ పనిచేయగా.. రెండో భాగానికి కమల్ కణ్నన్ పనిచేశాడు. దీంతో రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ రెగ్యులర్ సోషల్ సినిమాను అయి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.