నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్
పాలకొల్లు అర్బన్: రాజకీయాలు తనకు పడవని, తన 40 ఏళ్ల సినిమా కెరీర్‌లో అందర్నీ ఆనందింపజేయడమే ఇష్టమని నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో క్షీరపురి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ సంస్థ ఆయనను ‘జీవిత సాఫల్యతా పురస్కారం’తో ఘనంగా సత్కరించింది. టామీ సినిమాలో ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డు అందుకున్నందుకు ఆయనకు ఈ పురస్కారం ఇచ్చింది.
ఉత్తమ లఘుచిత్రం ‘క్రీమిలేయర్’
పాలకొల్లు అర్బన్: క్షీరపురి అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవ పోటీల్లో ఉత్తమ లఘుచిత్రంగా స్కైవ్యూ క్రియేషన్స్, శ్రీకాకుళం కథా రచయిత విజయ్‌కుమార్ చిత్రీకరించిన ‘క్రీమిలేయర్’ ఎంపికైంది. ఈ చిత్రోత్సవం స్థానిక రామచంద్ర గార్డెన్స్‌లో శనివారం కోలాహలంగా సాగింది. ద్వితీయ ఉత్తమ చిత్రంగా మాజీ ఎంపీ చేగొండి హరరామ జోగయ్య నిర్మించిన ఇండియా ఈజ్ డెడ్, తృతీయ ఉత్తమ చిత్రంగా గోదావరి టాకీస్ చిత్రం, రాజమండ్రి కథా రచయిత సి.కల్యాణ్ రూపొందించిన ‘బి అలర్ట్’ ఎంపికయ్యాయి. విజేతలకు వరుసగా రూ.60 వేలు, రూ.40 వేలు, రూ.20 వేల నగదు పారితోషికాలతో పాటు షీల్డ్‌లు అందజేశారు.
స్పెషల్ జ్యూరీ అవార్డులను ఇండియా ఈజ్ డెడ్‌లో ఇండియా పాత్రధారి చంద్రిక, పేరులో వికలాంగుడు పాత్రధారి సతీష్ సుంకర దక్కించుకున్నారు. స్పెషల్ జ్యూరీ చిత్రాలుగా మాతృదేవోభవ, హెల్మెట్ ఎంపికయ్యా యి. ఉత్తమ ఎడిటింగ్ మీ కోసమే లఘుచిత్రం ఫణిశ్రీ, ఉత్తమ కెమెరామెన్‌గా ఇండియా ఈజ్ డెడ్‌లో మోహన్‌చంద్, ఉత్తమ కథా రచయితగా బి అలర్ట్ కల్యాణ్, ఉత్తమ దర్శకుడిగా ఇండియా ఈజ్ డెడ్‌లో రాజేంద్రకుమార్ బహుమతులు అందుకున్నారు. జ్యూరీ కమిటీ సభ్యులుగా జనా ర్థన మహర్షి, ఎంవీ రఘు, పద్మిని, కె.వెంకట్రాజు, ఎ.బాబూరావు, కె.సురేష్, ఎన్. గోపాల్, డి.రవీంద్ర వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment