బిగ్‌బాస్ హౌస్‌లో రాఖీ పండగ సెలబ్రేట్ చేసుకోవడం.. అందులో పునర్నవి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం.. ఈ ఇంట్లో అతనిలో తమ్ముడిని చూసుకున్నానని చెబుతున్న ప్రోమో విడుదల చేయడం.. రాహుల్‌కు రాఖీ కట్టిందని సోషల్ మీడియాలో ట్రెండ్ అవడంతో నేటి ఎపిసోడ్‌ను అందరూ ఆసక్తికరంగా తిలకించారు. అయితే అందరూ ఊహించినట్లు ఆ రాఖీని రాహుల్‌కు కట్టలేదు.. పైగా.. అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్పా అని చెప్పి కుండబద్దలు కొట్టేసింది. శుక్రవారం నాటి ఎపిసోడ్ సాగిందిలా..
బిగ్‌బాస్ మెదడుకు మేత టాస్క్‌ను పెట్టి హౌస్‌మేట్స్ తెలివితేటలను పరీక్షించాడు. అబ్బాయిలు, అమ్మాయిలు అంటూ రెండు టీమ్స్‌గా విడగొట్టి.. మధ్యలో శివజ్యోతిని టీచర్‌గా పెట్టి క్విజ్ పోటీ నిర్వహించాడు. మొదటి రౌండ్‌లో జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలు అడగ్గా.. రెండో రౌండ్‌లో బిగ్‌బాస్ హౌస్‌లో జరిగిన, మాట్లాడుకున్న సంఘటనలపై ప్రశ్నలను వేశాడు. ఈ ప్రశ్నలకు హౌస్‌మేట్స్ దాదాపు అందరూ సరైన జవాబులనే చెప్పుకొచ్చారు. మూడో రౌండ్‌లో అబ్బాయిల టీమ్ దూకుడు ప్రదర్శించగా.. చివరకు రెండు టీమ్స్‌కు సేమ్ పాయింట్స్ వచ్చాయి. దీంతో చివరగా ఓ ప్రశ్నను సంధించగా.. రవికృష్ణ సమాధానం చెప్పడంతో అబ్బాయిల టీమ్ విజేతగా నిలిచింది.
అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్ప
రాహుల్‌కు తప్ప మిగతా వారందరికీ రాఖీ శుభాకాంక్షలు అని పునర్నవి చెప్పడంతో హౌస్‌లో నవ్వులు పూశాయి. దీంతో రాహుల్ ఫుల్ ఖుషీ అయినట్టు కనపడింది. వరుణ్ సందేశ్‌లో తన తమ్ముడిని చూసుకున్నానని చెప్పి పునర్నవి అతనికి రాఖీ కట్టింది. ఇంట్లోకి వచ్చినప్పుడు మొదటగా అన్న అని పిలిచిందని.. తనకు హిమజ రాఖీ కట్టాలని వరుణ్ తెలిపాడు. మహేష్.. అషూ రెడ్డితో రాఖీ కట్టించుకోగా, అలీరెజా.. శివజ్యోతితో కట్టించుకున్నాడు. తన ఇంట్లో వారు శివజ్యోతికి బహుమతి కూడా పంపారని అలీ తెలిపాడు. తన తమ్ముడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని శ్రీముఖి చెప్పి.. బాబా భాస్కర్‌చేతుల మీదుగా శ్రీముఖి రాఖీ కట్టించుకుంది. అనంతరం అందరూ స్వీట్లు పంచుకున్నారు. చివరగా బాబా భాస్కర్ కోసం ఓ సర్‌ప్రైజ్‌ను ఏర్పాటు చేశాడు. బాబా భాస్కర్ కోసం ఆయన సతీమణి పంపిన వీడియో సందేశాన్ని ప్లే చేసి చూపించాడు. వీకెండ్ వచ్చేసింది. ఇంట్లో నుంచి ఒకరు వెళ్లిపోయే తరుణం కూడా వచ్చేసింది. మరి ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌నుంచి శివ జ్యోతి, రవికృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, రోహిణి, బాబా భాస్కర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్‌లోంచి ఎవరు ఎలిమినేట్ కానున్నారో చూడాలి. (రాహుల్‌కు పునర్నవి రాఖీ కట్టిందా?)
Comments
Please login to add a commentAdd a comment