విశాల్‌కు రకుల్ హ్యాండిచ్చిందా? | rakul in vishal movie Tupparivalan | Sakshi
Sakshi News home page

విశాల్‌కు రకుల్ హ్యాండిచ్చిందా?

Published Fri, Oct 14 2016 2:14 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

విశాల్‌కు రకుల్  హ్యాండిచ్చిందా?

విశాల్‌కు రకుల్ హ్యాండిచ్చిందా?

విశాల్‌కు నటి రకుల్ ప్రీతీసింగ్ హ్యాండిచ్చారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. మొదట్లో ఎన్నమో ఏదో తదితర తమిళ చిత్రాల్లో నటించిన రకుల్ ప్రీతీసింగ్‌కు ఇక్కడ కలిసిరాలేదు. దీంతో తెలుగు చిత్రాలపై దృష్టిసారించారు. అక్కడ తనకు అదృష్టం కలిసొచ్చింది. ఇప్పుడు రకుల్ టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరు.అయితే కోలీవుడ్‌లోనూ రాణించాలన్న కోరిక ఉండడంతో అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తుండగా నటుడు విశాల్ రూపంలో అది వచ్చింది.
 
ఆయన కథానాయకుడిగా నటిస్తూ మిష్కిన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న తుప్పరివాలన్ చిత్రంలో రకుల్‌ప్రీతీసింగ్‌ను నాయకిగా ఎంపిక చేశారు. ప్రసన్న, వినయ్, దర్శకుడు కే.భాగ్యరాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో కమలహాసన్ రెండో కూతురు అక్షరహాసన్ ప్రతి నాయకి తరహా పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రాంరంభమైంది. రకుల్ ప్రస్తుతం తెలుగులో రామ్‌చరణ్‌కు జంటగా ధ్రువ, మహేశ్‌బాబు సరసన వాస్కోడిగామా, సాయిధరం తేజ్‌తో మిష్టర్ తదితర చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా ఉన్నారు.
 
దీంతో విశాల్ చిత్రానికి కాల్‌షీట్స్ సమస్య ఎదురైనట్లు సమాచారం. అందువల్ల తుప్పరివాలన్ చిత్రం నుంచి రకుల్‌ప్రీతీసింగ్ వైదొలగినట్లు టాక్. ఆమెకు బదులు మలయాళీ బ్యూటీ అను ఇమానువేల్‌ను ఎంపిక చేసే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement