
సైరా సెట్‌లో మంటలు చెలరేగాయని, సెట్ కాలిపోయిందని ఉదయం నుంచి వార్తలు వినిపించాయి. కోకాపేటలో సైరా కోసం వేసిన సెట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే తాజాగా ఆ చిత్ర నిర్మాత రామ్‌చరణ్ ఈ విషయాన్ని అధికారంగా ధృవీకరించారు.
ఈ ఘటనపై స్పందిస్తూ రామ్‌చరణ్ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘కోకాపేటలో వేసిన సైరా సెట్ ఈ ఉదయం దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకుంది. ఏ ఒక్కరికి ప్రమాదం జరగలేదు. చిత్రబృందం అంతా క్షేమంగా ఉంది. మా చివరి షెడ్యూల్‌ను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామ’ని ఫేస్‌బుక్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేశారు. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార లాంటి భారీ తారాగణంతో చిత్రీకరిస్తున్న ఈ మూవీకి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.