మెగా బ్యానర్లో అక్కినేని హీరో | Ram Charan To Produce Akhil Akkineni film | Sakshi
Sakshi News home page

మెగా బ్యానర్లో అక్కినేని హీరో

Dec 29 2016 1:17 PM | Updated on Sep 4 2017 11:54 PM

మెగా బ్యానర్లో అక్కినేని హీరో

మెగా బ్యానర్లో అక్కినేని హీరో

తండ్రికి తగ్గ వారసుడని ప్రూవ్ చేసుకున్న యంగ్ హీరో రామ్ చరణ్ ఇప్పుడు నిర్మాతగానూ నిరూపించుకునే పనిలో ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఖైదీ నంబర్ 150

తండ్రికి తగ్గ వారసుడని ప్రూవ్ చేసుకున్న యంగ్ హీరో రామ్ చరణ్ ఇప్పుడు నిర్మాతగానూ నిరూపించుకునే పనిలో ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఖైదీ నంబర్ 150 సినిమాతో నిర్మాతగా మారుతున్న రామ్ చరణ్, భవిష్యత్తులో మరిన్ని సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. కేవలం మెగా హీరోలతోనే కాదు, ఇతర హీరోలతోనూ సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

త్వరలోనే మరో యువ హీరోతో భారీ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు చెర్రీ. అఖిల్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అక్కినేని నటవారసుడు అఖిల్. ప్రస్తుతం తన రెండో సినిమాను విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు అఖిల్. ఈ సినిమాను రామ్ చరణ్ కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement