
ఇటీవల కాలంలో సినిమాలతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్న రామ్ గోపాల్ వర్మ.. ప్రస్తుతం నాగార్జున హీరోగా ఆఫీసర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న వర్మతో సినిమా చేసేందుకు నాగార్జున అంగీకరించటంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు తగ్గట్టుగా వర్మ మనసు పెట్టి ఈ సినిమాను తెరకెక్కించానని చెపుతున్నాడు.
ముందుగా ఈ సినిమా మే 25న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించాడు వర్మ. అయితే సాంకేతిక కారణాల వల్ల ఆఫీసర్ రిలీజ్ వాయిదా పడింది. ఈవిషయాన్ని తన సోషల్ మీడియా పేజ్ ద్వారా వెల్లడించారు. ‘క్వాలిటీ పరంగా సినిమాను అత్యున్నతంగా తీర్చిదిద్దేందుకు ముందుగా అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం పడుతోంది. అందుకే నాగార్జున ఆఫీసర్ సినిమాను మే 25న కాకుండా జూన్ 1న రిలీజ్ చేయాలని నిర‍్ణయించాం’ అని తెలిపారు.
Since many technical elements of #Officer with regard to the best viewing experience are taking much longer than initially planned , we decided to postpone @iamnagarjuna ‘s Officer release from 25 th May to 1st June
— Ram Gopal Varma (@RGVzoomin) 16 May 2018