
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా కడప పేరుతో వెబ్ సీరీస్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమాగా తెరకెక్కిస్తే సెన్సార్ బోర్డ్ నుంచి ఇబ‍్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో తను అనుకున్నది అనుకున్నట్టుగా తెరకెక్కించేందుకు డిజిటల్ మీడియంను ఎంచుకున్నట్టుగా తెలిపారు వర్మ. అందుకు తగ్గట్టుగా విపరీతమైన రక్తపాతంతో కడప ట్రైలర్ ను రిలీజ్ చేశాడు.
తాజాగా ఈ వెబ్ సీరీస్ కు సంబంధించిన టైటిల్ సాంగ్ తో పాటు లిరికల్ వీడియోనే రిలీజ్ చేశాడు. వర్మ ఆస్థాన రచయిత సిరాశ్రీ సాహిత్యమందించిన ఈ పాటకు రవిశంకర్ సంగీతమివ్వగా.. నవరాజ్ హన్స్ ఆలపించాడు. అంతా కొత్తవారితో తెరకెక్కిస్తున్న ఈ సీరీస్ ను ఎన్ అండ్ ఎన్ క్రియేషన్స్, ఏ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment