సాక్షి, సినిమా : విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ కొత్త వెబ్ సిరీస్ కడప ట్రైలర్ కాసేపటి క్రితం విడుదల అయ్యింది. ఇందులో ఏ పాత్రా కల్పితం కాదు.. ప్రాణ భయం మూలంగా వారి పేర్లు. ప్రాంతాల పేర్లు మార్చి చెప్పామంటూ వర్మ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ మొదలయ్యింది.
‘‘ఇది నాకు తెలిసిన నిజం కాదు.. నూటికి నూరుపాలు ముమ్మాటికీ నిజం’’ అంటూ వర్మ తన తెలుగు ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ ఉండబోతున్న అంశాల గురించి ముందుగానే హింట్ ఇచ్చేశాడు. చిన్న పిల్లల దగ్గరి నుంచి ఆడా, మగా, ముసలి ఇలా పగప్రతీకారం కోసం రగిలిపోవటం ట్రైలర్‌ను చూపించాడు. వెంట పడి నరుక్కోవటం.. కత్తులు, బాంబులు, అశ్లీలత, బూతు డైలాగులు... ఇలా వర్మ నుంచి ఎవైతే ఎలిమెంట్లు ఆశిస్తారో అన్నీ ఇందులో ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్లో కడప యమ ద్వారపు గడప అనే సాంగ్ రక్తచరిత్రను గుర్తుకు తెచ్చింది.
ఫ్యాక్షనమ్మ వెలిసింది సీమలో.. ఆ అమ్మ గుడి రాయలసీమ అయితే దాని గర్భగుడి కడప.. ఇది రాయలసీమ రెడ్ల చరిత్ర అంటూ ట్రైలర్ ను ముగించాడు. గతంలో కొన్ని కారణాల వల్ల ఈ విషయాలను వెలుగులోకి తేలేకపోయానని.. ఇప్పుడు అసలు రాయలసీమ శరీరాన్ని పూర్తిగా బట్టలిప్పదీసి చూపిస్తానని వర్మ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. కొందరు సీమ నేతల మాటలను సూక్తుల రూపంలో చూపించటం చూస్తే వర్మ ఎలాంటి అంశాలను చూపించబోతున్నాడోనన్న ఆసక్తి మొదలైపోయింది.
Comments
Please login to add a commentAdd a comment