నాకు నివాళులర్పించారు : వర్మ | Ramgopal varma contraversial comments on pawan Fans | Sakshi
Sakshi News home page

నాకు నివాళులర్పించారు : వర్మ

Published Wed, Oct 7 2015 2:24 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

నాకు నివాళులర్పించారు : వర్మ - Sakshi

నాకు నివాళులర్పించారు : వర్మ

వివాదాస్పద  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్పై విరుచుపడ్డాడు. గతంలో పవన్ ఫ్యాన్స్ నిరాక్షరాస్యులు కనుకే ట్విట్టర్లో పవన్కు ఫాలోయింగ్ తక్కువగా ఉందంటూ కామెంట్ చేసిన వర్మ. ఆ కామెంట్స్ పై వచ్చిన రియాక్షన్స్పై ఘాటుగా స్పందించాడు.

'హటాత్తుగా మరణించిన రామ్గోపాల్వర్మ, సినీ పరిశ్రమకి పట్టిన పీడ తొలగిపోయిందని హర్షం వ్యక్తం చేస్తున్న పలు సినీ ప్రముఖులు ఆనంద భాష్పాలతో వీడ్కోలు చెప్తూ నివాళులు అర్పిస్తున్న సినీ ప్రపంచం' అంటూ రాసిన ఫొటో ఒకటి రామ్గోపాల్ వర్మ ట్విట్టర్ పేజ్పై దర్శనమిచ్చింది.

ఆ ఫోటోలో ఉన్న భాషను ఉదహరిస్తూ 'ఈ ఇంగ్లీష్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత నిరాక్షరాస్యులో తెలియజేస్తుంది. పవన్ రైతులకు సాయం చేసే ముందు తన అభిమానుల కోసం స్కూల్స్ తెరవాలి. ఒక మెగా అభిమానిగా పవన్ అభిమానులకు నా విజ్ఞప్తి, పవన్ ఇబ్బందిగా ఫీల్ అయ్యేలా మాట్లాడకండి.

మీరు మీ ఊహల్లో నన్ను చంపగలరు. కానీ నా ఊహలను చంపలేరు. ఈ విషయం నిరాక్షరాస్యులు, సాంకేతికంగా వెనుకబడిన వారికి అర్థం కాదు. నిరక్షరాస్యులైన పవన్ ఫ్యాన్స్, కనీసం మహేష్ ఫ్యాన్స్ నుంచైనా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మహేష్ అభిమానులు పవన్ ఫ్యాన్స్కు నా ఇంగ్లీష్ ట్వీట్స్ ను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పండి'. అంటూ సీరియస్ కామెంట్స్ చేశాడు.

మరి ఈ తాజా కామెంట్స్పై పవన్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement