చిరు సినిమాలో క్యారెక్టర్పై రానా క్లారిటీ | Rana Denies news about Chiru uyyalawada narasimha reddy | Sakshi
Sakshi News home page

చిరు సినిమాలో క్యారెక్టర్పై రానా క్లారిటీ

Published Thu, May 11 2017 11:18 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

చిరు సినిమాలో క్యారెక్టర్పై రానా క్లారిటీ - Sakshi

చిరు సినిమాలో క్యారెక్టర్పై రానా క్లారిటీ

బాహుబలి సినిమాలో చేసిన భల్లాలదేవ క్యారెక్టర్తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రానాకు క్రేజీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా పీరియాడిక్, హిస్టారికల్, ఫోక్లోర్ చిత్రాలకు రానా బెస్ట్ ఆప్షన్ గా మారిపోయాడు. దీంతో హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలోనూ రానా కీలక పాత్ర పోషిస్తున్నాడంటూ వార్తలు వినిపించాయి.

ఈ వార్తలపై స్పందించిన రానా, అలాంటిదేమి లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇంతవరకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రయూనిట్ నుంచి తనతో ఎవరు సంప్రదించలేదని, ఆ సినిమాతో తాను నటిస్తున్నానంటు వచ్చిన వార్తలన్ని పుకార్లే అని కొట్టిపారేశాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి సినిమాతో పాటు మరో పీరియాడిక్ మూవీలోనూ రానా హీరోగా నటిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement