
జోలె పట్టిన హీరోలు.. హీరోయిన్లు
రణ్బీర్ కపూర్, కరణ్ జోహార్, అనుష్కాశర్మ, ప్రీతిజింటా.. వీళ్లందరిలో ఎవరికీ డబ్బుకు కొదవలేదు. అయినా అంతా కలిసి జోలె పట్టి భిక్షాటనకు బయల్దేరారు.
రణ్బీర్ కపూర్, కరణ్ జోహార్, అనుష్కాశర్మ, ప్రీతిజింటా.. వీళ్లందరిలో ఎవరికీ డబ్బుకు కొదవలేదు. అయినా అంతా కలిసి జోలె పట్టి భిక్షాటనకు బయల్దేరారు. ఇదేదో సినిమా షూటింగ్ అనుకుంటున్నారా.. కాదు. నేపాల్ బాధితులను ఆదుకోడానికి విరాళాలు సేకరించేందుకు కేర్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి స్టార్ ఇండియా సంస్థ చేపట్టిన కార్యక్రమానికి వీళ్లంతా తమవంతు సాయం అందిస్తున్నారు.
'పొరుగువారికి పొరుగువాళ్లే సాయం చేయగలరు' అనే నినాదంతో దేశవ్యాప్తంగా వీళ్లంతా కలిసి ఓ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రేక్షకులు నేరుగా ఆన్లైన్లో విరాళాలు ఇవ్వచ్చు లేదా చెకకులు, డీడీలను కూడా పంపొచ్చు. భారత ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ మైత్రి'తో పాటే ఈ కార్యక్రమం కూడా కొనసాగుతుంది.