'నిజమైన నటుడంటే అతనే' | Ranbir is a true actor: Imtiaz Ali | Sakshi
Sakshi News home page

'నిజమైన నటుడంటే అతనే'

Published Sun, Nov 22 2015 7:51 PM | Last Updated on Wed, Apr 3 2019 9:02 PM

'నిజమైన నటుడంటే అతనే' - Sakshi

'నిజమైన నటుడంటే అతనే'

ముంబై: రణబీర్ కపూర్ యాక్టింగ్పై ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ ఆలీ ప్రశంసలతో ముంచెత్తాడు. వీరి కాంబినేషన్లో తెరకెక్కిన తమాషా చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీలో రణబీర్ సరసన దీపికా పదుకునే నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా నిర్మాత ఆలీ చిత్ర విశేషాలను వివరించారు. రణబీర్ రిథమ్ వెరైటీగా ఉంటుందని, ఇండస్ట్రీలో అతని రికార్డులు ప్రత్యేకంగా
ఉంటాయన్నారు. రేసులో రణబీర్ లేకపోయినా అభిమానులు ఫాలో అవుతారని, రణబీర్ నిజమైన నటుడని కితాబిచ్చారు. తమాషాలో
రణబీర్.. వేద అనే పాత్రలో, దీపికా.. తార అనే పాత్రలలో మెరవనున్నారు. వీరివురి పాత్రలను పోల్చడం సరికాదని, ఈ జంట అద్భుతంగా నటించారని చెప్పాడు.  

2011లో వీళ్లిద్దరీ కాంబినేషన్లో వచ్చిన రాక్స్టార్ అవార్డుల పంట పండించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో రణబీర్ యాక్టింగ్పై తన అనుభవాలను ఆలీ చెప్పుకోచ్చాడు. రాక్స్టార్ మూవీ కంటే ఈ చిత్రంలో రణబీర్ బాగా ఎక్కువ కష్టపడ్డాడని, భిన్న పాత్రలలో ఆకట్టుకుంటాడని అన్నాడు. తమాషాలో రణబీర్ అభిమానులను కచ్చితంగా మెప్పిస్తాడని నిర్మాత ఆలీ విశ్వాసం వ్యక్తం చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement