రంగస్థలం మూవీ స్టిల్స్‌ లీక్‌ | rangasthalam movie stills leaked | Sakshi
Sakshi News home page

రంగస్థలం మూవీ స్టిల్స్‌ లీక్‌

Dec 11 2017 7:07 PM | Updated on Jul 14 2019 1:57 PM

rangasthalam movie stills leaked - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మెగాభిమానులను బాగా ఊరిస్తున్న చిత్రం 'రంగస్థలం'. ఇప్పటికే బయటకు వచ్చిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ అందరికీ నచ్చేసింది. పల్లెటూరి కుర్రాడి ఊరమాస్ లుక్‌లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అదిరిపోయే రేంజ్‌లో ఉన్నారు. ఇందులో ఆయన 'చిట్టిబాబు' అనే పాత్రలో కనిపిస్తుండగా, మార్చి 30న థియేటర్లలో చిట్టిబాబును కలుసుకోండంటూ రామ్ చరణ్ ఇప్పటికే చెప్పేశారు. దీని ప్రకారం సినిమా విడుదల మరో మూడు నెలలు ఉందనగా అప్పుడే లీకుల బెడద మొదలైంది. తమ చిత్రం స్టిల్స్‌ లీక్‌ చేశారంటూ చిత్ర యూనిట్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. లీకులకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలంటూ అందులో పేర్కొన్నారు. సాధారణంగా ఓ భారీ చిత్రం వస్తుందంటే దానికి లీకుల బెడద ఉండనే ఉంటుంది.

చిత్ర షూటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు దానికి సంబంధించిన స్టిల్స్‌, మాటలు, పాటలు, ఫైట్‌లు, వీడియోలు ఏవి లీకవుతుంటాయో అని చిత్ర యూనిట్‌ భయపడుతూ ఉండాల్సిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న లీకు వీరులు మాత్రం ప్రతిసారి పై చేయి సాధిస్తునే ఉన్నారు. ఇక సినిమా విషయానికి వస్తే ప్రతి చిత్రం విషయంలో ఒక క్లారిటీ అంటూ కొనసాగించే సుకుమార్‌ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. 1985లో జరిగిన స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథగా ఇది తెరకెక్కుతుండగా, ఇందులో చెర్రీ సరసన సమంత నటిస్తుంది. ఆది పినిశెట్టి, అనసూయ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జగపతి బాబు తదితరులు ముఖ్యపాత్రలలో కనిపిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement