
మాఫియా రాణిగా..
‘మర్దానీ’ హిట్‌ను ఎంజాయ్ చేస్తున్న రాణీ ముఖర్జీ త్వరలోనే మాఫియా రాణి పాత్ర పోషించనుంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం చెల్లెలు హసీనా పర్కార్ జీవిత కథ ఆధారంగా అపూర్వ లఖియా తెరకెక్కించనున్న చిత్రంలో రాణీ ముఖర్జీ టైటిల్ రోల్‌లో కనిపించనుంది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడా ప్రాంతం నుంచి కార్యకలాపాలు సాగించిన హసీనా ‘గాడ్‌మదర్ ఆఫ్ నాగ్‌పడా’గా పేరుమోసింది. ఆమె పాత్రకు రాణీ ముఖర్జీ పూర్తిగా న్యాయం చేయగలదని దర్శకుడు లఖియా చెబుతున్నాడు.