రష్మిక కోరికేంటో తెలుసా? | Rashmika Mandanna Reveals Her Desire | Sakshi
Sakshi News home page

రష్మిక కోరికేంటో తెలుసా?

Published Sun, Aug 4 2019 7:10 AM | Last Updated on Sun, Aug 4 2019 11:13 AM

Rashmika Mandanna Reveals Her Desire - Sakshi

చెన్నై : ఆశ పడవచ్చు. అత్యాసకు పోకూడదు అన్నది పెద్దల మాట. అయినా అతిగా ఆశ పడిన ఆడది..అంత పెద్ద డైలాగులు వద్దు గానీ, నటి రష్కిక కోరిక చూస్తుంటే ఎవరికైనా అలా అనాలనిపిస్తుంది. అయినా అదృష్టం అందలం ఎక్కిస్తుంటే రష్కికనే కాదు ఎవరికైనా అలాంటి కోరికలే పుడతాయేమో. 2016లో కిరాక్కు పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక. తొలి చిత్రంతోనే అనూహ్య విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అ బ్యూటీ వెంటనే టాలీవుడ్‌ నుంచి పిలుపొచ్చింది. అక్కడ నటించిన తొలి చిత్రం ఛలో చిత్రం సక్సెస్‌నిస్తే, ఆ తరువాత విజయ్‌దేవరకొండతో రొమాన్స్‌ చేసిన గీతగోవిందం సంచలన విజయాన్ని అందించింది. దీంతో ఈ అమ్మడు కోలీవుడ్‌ దృష్టిని తన వైపునకు తిప్పుకుంది. ఇక్కడ నటుడు కార్తీ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అంతే కాదు దళపతి విజయ్‌తో జతకట్టే అవకాశం రష్కికను వరించిందనే ప్రచారం హోరెత్తుతోంది. ఇక ఇటీవల తెరపైకి వచ్చిన తెలుగు చిత్రం డియర్‌ కామ్రేడ్‌ చిత్రం మంచి పేరును తెచ్చి పెట్టింది.

ఇక ప్రస్తుతం తెలుగులో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుతో నటిస్తున్న ఈ అమ్మడు త్వరలో ప్రారంభం కానున్న చిత్రంలో అల్లుఅర్జున్‌తోనూ రొమాన్స్‌ చేయబోతోంది. ఇలా చాలా వేగంగా నటి రష్మిక సక్సెస్‌ గ్రాఫ్‌ పెరుగుతూ పోతోంది. దీంతో ఈ అమ్మడి భావాలకు, కోరికలకు పగ్గాలు ఉంటాయని భావించలేం. ఇంతకీ ఈ అమ్మడు ఏమంటుందో చూద్దాం. నటించడానికి వచ్చిన ప్రారంభంలో నా ముఖాన్ని ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారో లేదో తెలియదు. ప్రయత్నం చేద్దాం అని సినీ జీవితాన్ని ప్రారంభించాను. అలా తొలి చిత్రమే విజయాన్ని అందించింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు ముంగిట వచ్చి వాలుతున్నాయి. అయితే ఇలా వేగంగా ఎదిగి, వెంటనే పడిపోకూడదు. అందుకే ప్రతి చిత్రాన్ని చాలా జాగ్రతగా ఎంపిక చేసుకుంటున్నాను. వాటి నుంచి చాలా నేర్చుకుంటున్నాను. ఒకరు నచ్చితే ఆ వ్యక్తికి గుడి కట్టించే అభిమానులు ఇక్కడ ఉంటూనే ఉంటారు. మా నాన్న నటి కుష్భూకు గుడి కట్టించిన విషయాన్ని చెబుతూనే  ఉంటారు. ఆ విషయాన్ని నేను నమ్మలేకపోయాను. అయితే ఇప్పుడు నాకూ గుడి కట్టిస్తే బాగుంటుందని బావిస్తున్నాను అని నటి రష్మిక ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. దీన్నేమంటారు ఆశ అంటారా? అత్యాశ అంటారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement