
వరుసగా భారీ చిత్రాలతో అలరిస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ శుక్రవారం సాక్ష్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సాక్ష్యం రిలీజ్‌కు ముందే మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడు తేజ దర్శకత్వంలో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్న సాయి, కొత్త దర్శకుడితో ఇప్పటికే ఓ సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్‌పాత్రకు ఆర్‌ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్‌ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట.
ఆర్‌ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్ తొలి సినిమాతోనే హాట్ టాపిక్ గా మారారు. ఆ సినిమా భారీ వసూళ్లు సాధించటంతో పాయల్‌కు వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి. ప్రస్తుతానికి ఈ బ్యూటీ ఏ సినిమాకు ఓకె చెప్పలేదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment