రాజా సరసన రాజ్‌పుత్‌ | RX 100 Star Payal Rajput To Romance Ravi Teja In His Next Film | Sakshi
Sakshi News home page

రాజా సరసన రాజ్‌పుత్‌

Oct 31 2018 12:58 AM | Updated on Oct 31 2018 3:21 AM

RX 100 Star Payal Rajput To Romance Ravi Teja In His Next Film - Sakshi

మొదటి సినిమా ‘ఆర్‌ఎక్స్‌ 100’ సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ అయినప్పటికీ నెక్ట్స్‌ సినిమా విషయంలో కంగారు పడకుండా మెల్లిగా సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు పాయల్‌ రాజ్‌పుత్‌. ఈ భామ లేటెస్ట్‌గా రవితేజ సరసన ఓ హీరోయిన్‌గా ఎంపికయ్యారని సమాచారం. రవితేజ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘డిస్కో రాజా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రామ్‌ తాళ్లూరి నిర్మించనున్నారు.

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌ ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఓ హీరోయిన్‌గా ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్‌ నభా నటేశ్‌ ఫిక్స్‌ అయ్యారు. ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్‌గా పాయల్‌ రాజ్‌పుత్‌ ఎంపికయ్యారు. డిసెంబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానున్న ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఇందులో ఆయన తండ్రి – కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తారు. ఈ సినిమాలో సునీల్‌ కీలకపాత్రలో నటించనున్నారు. దీపావళికి ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్‌ చేయనుంది. ఈ చిత్రానికి తమన్‌ స్వరకర్త.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement