బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ లాక్‌డౌన్ నేపథ్యంలో ఆయన ఫాం హౌజ్‌లో కుటుంబంతో కలిసి సందడి చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఆయన తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సల్మాన్ తన ఫామ్‌లో గుర్రంపై రైడ్ చేస్తున్న వీడియోను తాజాగా శుక్రవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. (నేను ఊహించలేదు.. భావోద్యేగంతో హీరోయిన్)
‘మరో రోజు.. ఇలా రైడ్‌తో’ అనే క్యాప్షన్‌తో భాయిజాన్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గుర్రంపై స్వారీ చేస్తున్న భాయిజాన్ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేగాక తన గుర్రానికి గడ్డి తినిపిస్తున్న వీడియోను షేర్ చేస్తూ ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ మై లవ్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన విషయం తెలిసిందే. కాగా సల్మాన్ ప్రస్తుతం రాధే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను రంజాన్‌కు విడుదల చేయనున్నట్లు సమాచారం. (నిజంగానే గడ్డి తిన్న సల్మాన్)
Comments
Please login to add a commentAdd a comment