
(ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరోయిన్ సమంత తాజాగా తన ఫ్యాన్స్ కోసం ఒక బ్యూటీ థెరపీని పరిచయం చేశారు. ఇప్పటివరకూ యోగా, పంటలు, వంటలు అంటూ సందడి చేసిన అక్కినేని వారి కోడలు బ్యూటీ టిప్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
తన రొటీన్‌లైఫ్ విశేషాలను సోషల్ మీడియాలో తరచూ షేర్ చేసే సమంత విటమిన్ ఇన్‌ఫ్యూషన్ థెరపీ గురించి చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేయడం విశేషం.వంట, తోటపనితో మీలో కొంతమందికి బోర్ కొట్టి ఉండవచ్చు అంటూ తాజాగా చర్మ సౌందర్యం, రక్షణ గురించి చర్చించారు. స్కిన్ గ్లో కోసం ఈ థెరపీ తనకు చాలా ఉపయోగపడిందన్నారు. అంతేకాదు 'సమంతా' కోడ్ ద్వారా సదరు క్లినిక్‌లో 25శాతం తగ్గింపు కూడా లభిస్తుందంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు.
టెర్రస్ గార్డెనింగ్ లో దూసుకుపోతున్న సమంత బయో ఎంజైముల తయారీలో కూడా ప్రావీణ్యం సాధించారు. ఇంటిని శుభ్రపరచుకునేందుకు ఎటువంటి రసాయనాలను వాడకుండా చేసుకోవచ్చని సమంత తన లేటెస్ట్ పోస్ట్ లో పేర్కొన్నారు. బత్తాయి లేదా నిమ్మ(సిట్రస్) తొక్కలను పులియబెట్టడం ద్వారా తయారైన సేంద్రీయ క్రిమినాశిని గురించి వివరించారు. ఫ్లోర్, బాత్రూమ్, గ్లాస్ క్లీనింగ్ కోసం, డిష్ వాషింగ్, లాండ్రీ మొదలైన వాటి కోసం వీటిని ఉపయోగించవచ్చన్నారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment