చిన్నప్పటి నుంచే ఆ అలవాటుంది | samantha has a Social services | Sakshi
Sakshi News home page

చిన్నప్పటి నుంచే ఆ అలవాటుంది

Published Wed, Aug 3 2016 1:24 AM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

చిన్నప్పటి  నుంచే  ఆ అలవాటుంది

చిన్నప్పటి నుంచే ఆ అలవాటుంది

సామాజిక సేవ సంతోషాన్నిస్తుందని చెన్నై చంద్రం సమంత పేర్కొన్నారు. త్వరలో ప్రేమించిన ప్రియుడిని పెళ్లాడబోతున్న ఈ లక్కీబ్యూటీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంటూ తనకు సామాజిక సేవాదృక్పథం అధికం అన్నారు. చిన్నతనం నుంచే ఇతరులకు సాయం చేసే అలవాటు ఉందన్నారు. ఇప్పుడు నటిగా చాలా సంపాదిస్తున్నానని.. నిజానికి తాను నటిగా ఈ స్థాయికి ఎదుగుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. తన బుద్ధిశాలితనమో, ప్రతిభనో డబ్బు సంపాదించపెట్టలేదన్నారు. తనకంటే ప్రతిభావంతులు చాలా మంది ఉన్నారని అన్నారు. అదృష్టమే తననీ స్థాయిలో కూర్చోబెట్టిందని అన్నారు.

తననీ స్థాయిలో నిలబెట్టిన సమాజానికి ఏమైనా చేయాలన్న సేవాభావంతోనే ప్రత్యూష ఫౌండేషన్‌ను నెలకొల్పానన్నారు. దీని ద్వారా నిరుపేదలకు సాయాన్ని, విద్యాదానాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన దానిలో ఒక భాగాన్ని సేవాకార్యక్రమాలకు వినియోగించాలన్నారు. నటిగా తనను పలువురు అభినందిస్తున్నారని.. అది ఆ సమయంలో సంతోషాన్ని కలిగిస్తుందని వ్యాఖ్యానించారు.  ఇ తరులకు సాయం చేయడం, పేదల కోసం పాటుపడడం వల్ల కలిగే సంతోషం జీవితాంతం ఉంటుందని సమంత పేర్కొన్నారు. అందుకే తన జీవితంలో సామాజిక సేవాకార్యక్రమాలను ఒక భాగంగా ఆచరిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు ఈ బ్యూటీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement