
స్క్రీన్ టెస్ట్
మహేశ్‌బాబుకు ఓ సెంటిమెంట్ ఉంది. అది పాటిస్తే సినిమా బాగా ఆడుతుందని ఆయన నమ్మకం! అదేంటి?
ఎ) టైటిల్‌లో మూడక్షరాలు ఉండేలా చూసుకోవడం
బి) ప్రెస్‌మీట్స్‌కు బ్లాక్ లేదా బ్లూ కలర్ షర్టులో హాజరుకావడం
సి) ఫారిన్‌లో ఒక్క పాటైనా షూటింగ్ చేయడం
డి) ముహూర్తమ్ షాట్‌కు డుమ్మా కొట్టడం
‘బాహుబలి: ద బిగినింగ్’ కోసం ఎన్ని విజువల్ ఎఫెక్ట్స్ (గ్రాఫిక్స్) షాట్స్ రూపొందించారు?
ఎ) 3000 బి) 5000
సి) 7000
డి) 10000
కమల్‌హాసన్ సినిమా స్ఫూర్తితో రచయిత విజయేంద్రప్రసాద్ ‘సింహాద్రి’ కథ రాశారు. మరి, ఆ కమల్ సినిమా ఏదో తెలుసా?
ఎ) వయసు పిలిచింది
బి) వసంత కోకిల
సి) ఎర్ర గులాబీ
డి) మహానది
‘దమ్ము’లోని ‘ఉత్తరం ఊపు మీదుందే.. దక్షిణం దంచికొట్టిందే’ పాటలో ఎన్టీఆర్ ఎంతమంది హీరోయిన్లతో డ్యాన్స్ చేశారు?
ఎ) ఇద్దరు బి) ముగ్గురు
సి) నలుగురు డి) ఐదుగురు
‘అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు’ పాటలో మొదటి చరణం ఏ వాక్యంతో మొదలవుతుంది?
ఎ) ఎర్ర చొక్కానే నీ కోసం వేశాను
బి) ఎర్ర చీరేమో ఈ రోజే కొన్నాను
సి) ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగ... డి) మండే ఎండలో ఐస్‌క్రీమ్ బండిలా....
శోభన్‌బాబు సరసన ఎక్కువ సినిమాల్లో కథానాయికగా నటించిందెవరు?
ఎ) వాణిశ్రీ బి) శారద
సి) జయసుధ
డి) జయప్రద
ఎన్టీఆర్ మనవరాలిగా నటించిన శ్రీదేవి, తర్వాత ఆయన పక్కన పలు చిత్రాల్లో కథానాయికగా నటించారు. ఎన్టీఆర్–శ్రీదేవి జంటగా నటించిన మొదటి సినిమా?
ఎ) వేటగాడు బి) రౌడీ రాముడు కొంటె కృష్ణుడు సి) కొండవీటి సింహం
డి) అనురాగ దేవత
శోభన్ బాబు తర్వాత ఇద్దరు హీరోయిన్ల సినిమాలు ఎక్కువగా చేసిన హీరో?
ఎ) సుమన్
బి) రాజేంద్రప్రసాద్
సి) సీనియర్ నరేష్
డి) జగపతిబాబు
వెంకటేశ్ హీరోగా నటించిన తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ దర్శకుడు ఎవరు?
ఎ) దాసరి
బి) వి.బి. రాజేంద్రప్రసాద్
సి) కె. రాఘవేంద్రరావు
డి) బి.గోపాల్
భారతీరాజా దర్శకత్వంలో సూపర్‌స్టార్ కృష్ణ నటించిన సినిమా?
ఎ) తేనె మనసులు
బి) అశ్వద్ధామ
సి) రాజకీయ చదరంగం
డి) జమదగ్ని
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్‌రెడ్డి దర్శకుడిగా చేసిన సినిమా?
ఎ) ధర్మచక్రం
బి) నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్
సి) వెంకీ
డి) ఒకరికి ఒకరు
నటుడు భానుచందర్ ఈ ప్రముఖ సంగీత దర్శకుని కుమారుడు.
ఎ) మాస్టర్ వేణు
బి) సుసర్ల దక్షిణామూర్తి
సి) టి.చలపతిరావు
డి) టి.వి.రాజు
దర్శకుడు వంశీ సినిమాలంటే ఇళయరాజా సంగీతమే ఎక్కువగా గుర్తొస్తుంది. ఈ కింది వాటిలో ఇళయరాజాతో వంశీ పని చేయని సినిమా?
ఎ) సితార బి) ప్రేమించు పెళ్లాడు
సి) స్వరకల్పన
డి) మహర్షి
బాలకృష్ణకు నటి సీత చెల్లెలుగా నటించిన చిత్రం?
ఎ) ముద్దుల కృష్ణయ్య
బి) ముద్దుల మావయ్య
సి) మువ్వ గోపాలుడు
డి) మాతో పెట్టుకోకు
మోహన్ బాబుకు పేరు తెచ్చిన ‘అసెంబ్లీ రౌడీ’ తమిళ మాతృక ‘వేలై కిడైచ్చాచ్చు’లో హీరో?
ఎ) పార్తిపన్
బి) రజనీకాంత్
సి) విజయకాంత్
డి) సత్యరాజ్
కమలహాసన్ మొదటి భార్య పేరు?
ఎ) వాణీ గణపతి
బి) సారిక
సి) వాణీ విశ్వనాథ్
డి) గౌతమి
హీరో అఖిల్ మొదటిసారి వెండి తెర మీద కనిపించిన సినిమా?
ఎ) అఖిల్ బి) మనం
సి) సిసింద్రీ
డి) ఏ మాయ చేసావే
సినీ నటి రోజా అసలు పేరు?
ఎ) శ్రీలక్ష్మి
బి) విజయలక్ష్మి
సి) శ్రీలత
డి) సుజాత
రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్ కాకముందు జాతీయస్థాయి క్రీడాకారిణి. రకుల్ ఏ ఆట ఆడేవారు?
ఎ) టేబుల్ టెన్నిస్
బి) గోల్ఫ్
సి) బాస్కెట్‌బాల్
డి) హాకీ
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచి
20 సమాధానాల వరకూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు: 1) డి 2) బి 3) బి (‘వసంత కోకిల’లో మతి చలించిన అమ్మాయికి హీరో చికిత్స చేయిస్తాడు.
ఈ పాయింట్‌ను స్ఫూర్తిగా తీసుకుని ‘సింహాద్రి’ కథ, ఇంటర్వెల్ బ్లాక్ రాశారు) 4) సి 5) సి 6) సి (31 చిత్రాల్లో
శోభన్‌బాబు–జయసుధ జంటగా నటించారు) 7) ఎ 8) డి 9) సి 10) డి 11) బి 12) ఎ 13) సి
14) బి 15) డి 16) ఎ 17) సి 18) సి 19) బి 20) సి (శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన
‘ఫొటో’తో అంజలి హీరోయిన్‌గా పరిచయమయ్యారు. నందు హీరో)