స్క్రీన్ టెస్ట్
1 మహేశ్‌బాబు, అల్లు అర్జున్,రామ్‌చరణ్... ఈ ముగ్గుర్నీ హీరోలుగా పరిచయం చేసిన నిర్మాత ఒకరే. ఆయనెవరు?
ఎ) అల్లు అరవింద్ బి) బీవీఎస్‌ఎన్ ప్రసాద్
సి) సి. అశ్వినీదత్ డి) ‘దిల్’ రాజు
2 సాయిధరమ్ తేజ్ అల్లు అర్జున్‌కు ఏమవుతారు?
ఎ) బావ బి) తమ్ముడు
సి) బావమరిది డి) అల్లుడు
3 కమల్‌హాసన్ హీరోగా, చిరంజీవి విలన్‌గా బాలచందర్ దర్శకత్వం వహించిన సినిమా?
ఎ) అంతులేని కథ బి) మరో చరిత్ర
సి) ఇది కథ కాదు డి) అందమైన అనుభవం
4 రజనీకాంత్ అతిథి పాత్ర చేసిన మోహన్‌బాబు సినిమా?
ఎ) పెదరాయుడు బి) రాయలసీమ రామన్న చౌదరి
సి) రాయుడు డి) శ్రీ రాములయ్య
5 ఈ హాట్ డ్యాన్సర్ అసలు పేరు విజయలక్ష్మి?
ఎ) అభినయ శ్రీ బి) జ్యోతిలక్ష్మి
సి) సిల్క్ స్మిత డి) జయమాలిని
6 కె. విశ్వనాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా?
ఎ) భారతంలో బాలచంద్రుడు బి) జననీ జన్మభూమి
సి) ధర్మక్షేత్రం డి) గాండీవం
7 ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఏ హిందీ సినిమాలోని పాటలో ప్రభాస్ అతిథిగా స్టెప్పులేశారు?
ఎ) వాంటెడ్ బి) రౌడీ రాథోడ్
సి) సింగ్ ఈజ్ బ్లింగ్ డి) యాక్షన్ జాక్సన్
8 నిత్యా మీనన్ ఆమె నటించిన ఓ సినిమాలోని మరో హీరోయిన్‌కు డబ్బింగ్ చెప్పారు. ఏ సినిమాలో ఏ హీరోయిన్‌కు నిత్యా డబ్బింగ్ చెప్పారు?
ఎ) ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో ఇషా తల్వార్‌కు బి) ‘180’లో ప్రియా ఆనంద్‌కు
సి) ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో సమంతకు డి) ‘ఇంకొక్కడు’లో నయనతారకు
9 ‘గీతాంజలి’లోని ‘జల్లంత కవ్వింత’లో హీరోయిన్ గిరిజతో కలసి స్టెప్పులేసిన డ్యాన్స్‌మాస్టర్?
ఎ) ప్రభుదేవా బి) రాఘవా లారెన్స్
సి) సుందరం మాస్టర్ డి) రాజుసుందరం
10 రవితేజ పాడిన ‘కాజలు చెల్లివా’, ‘నోటంకి.. నోటంకి...’ ఈ రెండు పాటలను రాసిన లిరిక్ రైటర్ ఎవరు?
ఎ) భాస్కరభట్ల బి) కందికొండ
సి) రామజోగయ్య శాస్త్రి డి) శ్రీమణి
11 ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..’ పాటలో తొలి చరణం ఏ వాక్యంతో మొదలవుతుంది?
ఎ) ఇంట్లో ప్లాటినమ్ పరుపులు వేయాలే.. బి) చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే..
సి) పొగరెక్కిన సింహంలాంటి మొగుడు కావాలే... డి) వజ్రాలతో ఒళ్లంతా నింపేసి పోవాలే...
12 ‘మానవా... మానవా’ అంటూ దేవలోక భాషతో శ్రీదేవి సందడి చేసిన సినిమా?
ఎ) క్షణక్షణం బి) జగదేకవీరుడు అతిలోక సుందరి
సి) గోవిందా గోవిందా డి) ప్రేమాభిషేకం
13 ‘గుడుంబా శంకర్’లో పవన్‌కల్యాణ్ వేసుకున్నాడని ఈ డిజైన్ ఫ్యాంటులను ఫ్యాన్స్ తెగ కొన్నారు?
ఎ) బ్యాగీ జీను ఫ్యాంటు బి) సిక్స్ పాకెట్ ఫ్యాంటు
సి) డబుల్ ఫ్యాంటు డి) బ్లాక్ అండ్ వైట్ షేడ్ ఫ్యాంటు
14 జయప్రద కంటే ముందు ‘సాగర సంగమం’లో ఈ హీరోయిన్‌కు ఛాన్స్ వచ్చింది! కానీ, డేట్స్ అడ్జస్ట్ చేయలేక మిస్ చేసుకున్నారు!
ఎ) జయసుధ బి) సుమలత
సి) మాధవి డి) విజయశాంతి
15 ‘ఊహలు గుసగుసలాడె’తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన రాశీఖన్నా అంతకు ముందు ఓ తెలుగు సినిమాలో అతిథి పాత్ర చేశారు! ఆ సినిమా ఏది?
ఎ) ఎవడు బి) మనం
సి) రెడీ డి) పైసా
16 మహేశ్‌బాబు ‘అర్జున్’ సిన్మాలో అండర్‌వాటర్ ఫైట్ కంపోజ్ చేసిన ఈ ఫైట్‌మాస్టర్ పేరేంటో చెప్పుకోండి చూద్దాం!
ఎ) కణల్ కన్నన్ బి) ‘స్టంట్ శివ’
సి) విజయన్ డి) విజయ్
17 ముట్టకుండా కొట్టకుండా 45డిగ్రీస్ కాన్సెప్ట్‌తో ఎన్టీఆర్ విలన్స్‌ను చిత్తు చిత్తు చేసిన సినిమా?
ఎ) జనతా గ్యారేజ్ బి) నాన్నకు ప్రేమతో
సి) అదుర్స్ డి) రామయ్యా వస్తావయ్యా
18 సూర్య వైఫ్ జ్యోతిక ఏ హీరోయిన్ చెల్లెలు?
ఎ) నగ్మా బి) రాధిక
సి) సుహాసిని డి) రమ్యకృష్ణ
19 బ్లాక్ అండ్ వైట్‌లోని ఈ భానుప్రియ స్టిల్ ఏ సినిమాలోనిది?
ఎ) ఆత్మబలం బి) అన్వేషణ
సి) అమెరికా అల్లుడు డి) ఆలాపన
20 ఈ ఫొటోలోని ఇప్పటి స్టార్ హీరోయిన్ ఎవరు?
ఎ) శ్రియ బి) హన్సిక
సి) రకుల్‌ప్రీత్ సింగ్ డి) కాజల్ అగర్వాల్
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాల వరకూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు
1) సి 2) బి 3) సి 4) 5) సి 6) బి 7) డి 8) ఎ 9) సి 10) ఎ 11) ఎ 12) బి 13) సి 14) ఎ 15) బి 16) సి 17) బి 18) ఎ 19) బి 20) ఎ.