బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, అతని సతీమణి గౌరీ ఖాన్‌లు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. షారుఖ్‌కు ఈ మధ్య సినిమాలు కలిసి రావడం లేదు. సరైన హిట్‌ను చూసి చాలా కాలమైంది. షారుఖ్.. సినిమాలకు కాస్త విరామం ఇచ్చినట్లు కూడా కనిపిస్తోంది. షారుఖ్, తన పిల్లల గురించి సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌ను గౌరీ ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. నేడు ఆమె తల్లి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
షారుఖ్.. తన అత్తగారు సవిత చిబ్బర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అత్తగారికి షారుఖ్ స్వీట్ విషెస్ అందజేశారు. చెరగని చిరునవ్వుతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సవిత చిబ్బర్, షారుఖ్, అబ్రమ్ కలిసి ఉన్న ఫొటోను గౌరీ ఖాన్ పోస్ట్ చేశారు. ఆదివారం తల్లి పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె కుమార్తె గౌరీ ఖాన్ తనకు గ్రీటింగ్స్ అందజేశారు. తన పిల్లలు సినిమాల్లోకి వస్తారా లేదా అనేదానిపై షారుఖ్ క్లారిటీ ఇచ్చేశారు. కుమారుడు ఆర్యన్ నటుడు కావాలనుకోవట్లేదు అని, దర్శకుడిగా మారాలనుకుంటున్నాడని తెలిపారు. అందుకోసం అమెరికాలో తర్ఫీదు పొందుతున్నాడని వెల్లడించారు. ఇక మిగతా ఇద్దరికీ నటనపై ఆసక్తి ఉంటే చదువు పూర్తయ్యాక వారికి తర్ఫీదు ఇచ్చి నటనారంగానికి పరిచయం చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా వారి పిల్లలకు మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నారు. దానికి సంబంధించిన ఫొటోను కూడా షారుఖ్ నెటిజన్లతో పంచుకున్నారు.
May you always be as funny and full of life as you are. https://t.co/7NvKkDxuJ6
— Shah Rukh Khan (@iamsrk) September 8, 2019
Keeping up the tradition of Tae ‘Khan’ Doh in the family, the latest entrant to the Kiran Teacher ( @care141 )Fight Club. Yellow belt it is... pic.twitter.com/o8Ie7T2Hso
— Shah Rukh Khan (@iamsrk) August 26, 2019
Comments
Please login to add a commentAdd a comment