కమల్ హాసన్, విక్రమ్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూసి మల్టీస్టారర్ మూవీకి కొబ్బరికాయ కొట్టారని తప్పులో కాలేయకండి. ఆ టైమ్ ఎప్పుడు వస్తుందో చెప్పలేం కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ విక్రమ్ హీరో. కమల్‌హాసన్ నిర్మాత. రాజేష్. ఎమ్. సెల్వ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా కమల్ సొంత సంస్థ రాజ్‌కమల్ ఇంటర్‌నేషనల్ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కమల్ రెండో కుమార్తె అక్షరాహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ‘‘స్టైలిష్ అండ్ టాలెంట్ హీరో విక్రమ్‌తో నా సినిమా మొదలైంది. అమేజింగ్ టీమ్ కుదిరింది’’ అని రాజేష్ పేర్కొన్నారు. ఈ సినిమా ఓ ఫ్రెంచ్ మూవీకి రీమేక్ అని టాక్. ఈ సంగతి ఇలా ఉంచితే.. విక్రమ్, కీర్తీ సురేశ్, ఐశ్వర్యా రాజేష్ ముఖ్య తారలుగా హరి దర్శకత్వంలో ‘సామి’కి సీక్వెల్‌గా రూపొందిన ‘సామీ స్క్యేర్’ చిత్రం సెప్టెంబర్ 20న రిలీజ్ కానుందన్న వార్తలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment