వేశ్య పాత్రలో శ్రద్ధ | Shraddha Das to play a prostitute | Sakshi
Sakshi News home page

వేశ్య పాత్రలో శ్రద్ధ

Published Mon, Jan 6 2020 3:11 AM | Last Updated on Mon, Jan 6 2020 3:12 AM

Shraddha Das to play a prostitute - Sakshi

శ్రద్ధాదాస్‌

నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శ్రద్ధాదాస్‌. ఈ మధ్య ఇతరభాషల్లో సినిమాలు చేస్తూ టాలీవుడ్‌కు కాస్త దూరమైన ఆమె ఇప్పుడు ఓ చాలెంజింగ్‌ పాత్రలో నటించడానికి సిద్ధమయ్యారు. తన తర్వాతి తెలుగులో చిత్రంలో ఆమె వేశ్య పాత్రలో నటించబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు విద్యాసాగర్‌ దర్శకత్వం వహిస్తారట. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీరణ ప్రారంభమైందని సమాచారం.

ఈ చిత్రంలో జగపతిబాబు ఓ వ్యాపారవేత్తగా నటిస్తున్నారని తెలిసింది. భాగోద్వేగంతో కూడుకున్న పాత్రలో నటిస్తున్నారట శ్రద్ధా. ఈ పాత్ర నటిగా తనను చాలెంజ్‌ చేస్తోందని శ్రద్ధా భావిస్తున్నారట. ఈ సినిమాలో కొన్ని ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ ఉంటాయని, అవి సినిమాకు చాలా కీలకమైనవని సమాచారం. కథ పరంగా ఉండే ఓ ట్విస్ట్‌ ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేస్తుం దట. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు చిత్రబృందం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement