
ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తరువాత చేయబోయే సినిమాను కూడా ఓకె చేశాడు. మరోసారి రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించనున్నాడు చిరు. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ సినిమాలో కీలక పాత్రకు మల్టీ టాలెంటెడ్ బ్యూటీ శృతీ హాసన్‌ను ఓకె చేసినట్టుగా తెలుస్తోంది. కొంత కాలంగా నటనకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ మెగాస్టార్ సినిమాలో నటించేందుకు సుముఖంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మెగా ఫ్యామిలీ హీరోలు పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌లకు జోడిగా నటించింది శృతి. అయితే మెగాస్టార్ సినిమాలో మాత్రం హీరోయిన్‌గా కాకుండా ఓ కీలక పాత్రలో కనిపించనుందట.
Comments
Please login to add a commentAdd a comment