శృతి పాట.. తమన్నా ఆట | Shruthi Lends Voice for tamanna | Sakshi
Sakshi News home page

శృతి పాట.. తమన్నా ఆట

Published Sun, Aug 28 2016 11:54 AM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

శృతి పాట.. తమన్నా ఆట

శృతి పాట.. తమన్నా ఆట

మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న సౌత్ స్టార్ వారసురాలు శృతిహాసన్. హీరోయిన్ గానే కాక.. గాయనిగా కూడా ఆకట్టుకుంటున్న ఈ హాట్ బ్యూటి ఇప్పటికే చాలా సినిమాల్లో పాటలు పాడింది. అయితే ఎక్కువగా తను నటించిన సినిమాల్లో మాత్రమే పాటలు పాడే శృతి.. అప్పుడప్పుడు ప్రైవేట్ సాంగ్స్ తోనూ ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈ బ్యూటి మరో హీరోయిన్ కోసం పాట పాడేందుకు రెడీ అవుతోంది. తమిళ్లో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న కత్తి సండెయ్ సినిమాలో తమన్నా కోసం శృతిహాసన్ ఓ పాట పాడనుంది. విశాల్తో పాటు తమన్నాతో కూడా శృతికి మంచి రిలేషన్ ఉండటంతో ఈ పాట పాడేందుకు అంగీకరించింది. తమిళ స్టార్ మ్యూజిషియన్ హిప్ హాప్ తమీజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. కత్తి సండెయ్ తెలుగు ఒక్కడొచ్చాడు పేరుతో రిలీజ్కు రెడీ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement