శింబూతో రహస్య వివాహం! | Simbu and Nayanthara's marriage! | Sakshi
Sakshi News home page

శింబూతో రహస్య వివాహం!

Published Thu, Jan 23 2014 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM

శింబూతో రహస్య వివాహం!

శింబూతో రహస్య వివాహం!

శింబు, నయనతార రహస్య వివాహం చేసుకుంటారు. మూడో మనిషి లేకుండా నయన్ మెడలో శింబు గప్‌చిప్‌గా తాళి కట్టేస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ రిజిస్టర్ ఆఫీసుకి వెళ్లి, అక్కడ మళ్లీ పెళ్లి చేసుకుంటారు. అది మాత్రమే కాదు.. హిందు సంప్రదాయం ప్రకారం ఓసారి, క్రిస్టియన్ పద్ధతిలో ఇంకోసారి.. ఇలా మొత్తం నాలుగుసార్లు పెళ్లి చేసుకుంటుందీ జంట. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఒకప్పుడు శింబు, నయనతార ప్రేమించుకోవడం, ఆ తర్వాత విడిపోవడం అందరికీ తెలిసిందే. విడిపోయిన తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించడం కూడా మానేశారు. ఈ జంట తెరపై కనిపించి దాదాపు ఐదేళ్లయ్యింది. 
 
 ఇంత గ్యాప్ తర్వాత శింబు, నయనతార ఓ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. సో.. ఈ మాజీ ప్రేమికుల మధ్య మళ్లీ ప్రేమ చిగురించి, పెళ్లి వరకు వెళ్లి ఉంటారని ఊహిస్తున్నారా? అదేంకాదు. ప్రస్తుతం శింబు, నయనతార ఓ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. పైన చెప్పిన నాలుగు పెళ్లిళ్లూ ఈ సినిమాలోనే జరుగుతాయి. పాండిరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ లొకేషన్‌లో గతంలోలా శింబు, నయనతార చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారట. షూటింగ్ విరామ సమయంలో ఇద్దరూ జోక్స్ వేసుకుని నవ్వుకోవడంతో త్వరగానే తమ పాత స్నేహాన్ని పునరుద్ధరించుకున్నారని చెప్పుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement