త్రిపాత్రాభినయంలో శింబు | Simbu's Next With Adhik Titled Anbaanavan, Asaraathavan | Sakshi
Sakshi News home page

త్రిపాత్రాభినయంలో శింబు

Published Thu, Jun 30 2016 1:25 AM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

త్రిపాత్రాభినయంలో శింబు

త్రిపాత్రాభినయంలో శింబు

కథానాయకుల త్రిపాత్రాభినయం అన్నది ఇటీవల కోలీవుడ్‌లో చాలా అరుదైన విషయంగా మారింది. అప్పట్లో దివంగత మహానటుడు శివాజీగణేశన్ పలు పాత్రల్లో నటించి మెప్పించారు. ఆ తరువాత కమలహసన్, రజనీకాంత్ బహుపాత్రల్లో మెరిశారు. ఆపై ఇదుగో ఇటీవల త్రిపాత్రాభియాల సందడి మొదలైందని చెప్పవచ్చు. నటుడు సూర్య 24 చిత్రంలో మూడు పాత్రలు పోషించి దుమ్మురేపారు. అదే విధంగా ఆయన సోదరుడు కార్తీ కూడా కాష్మోరా చిత్రంలో త్రిపాత్రాభినయంతో రానున్నారు. తాజాగా సంచలన నటుడు శింబు మూడు పాత్రలు ధరించడానికి సిద్ధమవుతున్నారు.
 
 ఆయన ఆధిక్ రవిచంద్రన్ చిత్రంలో అన్భానవన్ అదంగాదవన్ అసరాదవన్ అనే చిత్రంలో ట్రిపుల్ రోల్ చేయనున్నారు. ఇందులో ఒకటి విలన్ పాత్ర అని సమాచారం. దీనికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.చాలా కాలం తరువాత శింబు, యువన్ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం ఇదే అవుతుంది. యువన్ ఇప్పటికే దీని పాటలకు రాగాలు కట్టడం ప్రారంభించారట. త్వరలోనే ఆ అన్భానవన్ అదంగాదవన్ అసరాదవన్ చిత్రం సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement